Tuesday, November 5, 2024

పిఆర్‌సి బకాయిలపై సవరణ జిఓ విడుదల

- Advertisement -
- Advertisement -

New PRC for Model School Teachers

 

మనతెలంగాణ/ హైదరాబాద్: గత ఏప్రిల్ 2021 నుంచి కొత్త పిఆర్‌సి నగదు చెల్లింపులకు ప్రభుత్వం అంగీకరించి, జూన్ నెల నుంచి మాత్రం పెరిగిన వేతనాలను చెల్లిస్తున్నారు. గత ఏప్రిల్, మే ( రెండు నెలల) బకాయిలను మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వచ్చే నెలతో ముగుస్తుండడంతో ప్రభుత్వం పాత నిర్ణయాన్ని మార్చుకొని ఆ బకాయిలను 18 నెలలో చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు నెలల బకాయిలను వచ్చే ఆర్థిక సంవత్సరం ( ఏప్రిల్ 2022 ) నుంచి మొదలుకొని 18 సమాన వాయిదాల్లో 18 నెలలు చెల్లిస్తారు. మరణించిన ఉద్యోగుల విషయంలో మాత్రం ఈ 2 నెలల బకాయిలను ఒకే సారి వారి కుటుంబ సభ్యులకు లేదా వారసులకు చెల్లిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News