Wednesday, January 22, 2025

ఇండియా అమెరికా 2 ప్లస్ 2 భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికా ఇండియాల మధ్య కీలకమైన 2 ప్లస్ 2 డైలాగ్ జరిగింది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల విస్తృతి కేంద్రీకృతంగా సాగిన ఈ చర్చలలో ఇతర విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ప్రత్యేకించి పశ్చిమాసియా పరిస్థితి, ఉక్రెయిన్ రష్యా ఘర్షణ , ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక పాటవ పరిస్థితి వంటి విషయాలను ఇరు దేశాలు విశ్లేషించాయి. ఇండియా యుఎస్ 2 ప్లస్ 2 మంత్రుల స్థాయి సదస్సులో ఇరు దేశాల రక్షణ మంత్రులు, విదేశాంగ మంత్రులు పాలుపంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రపంచ స్థాయి భౌగోళిక ఉద్రిక్తతల

నడుమ ఈ 2 ప్లస్ 2లో బారతదేశం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా తరఫున లాయడ్ ఆస్టిన్, ఆంటోనీ బ్లింకెన్‌లు పాల్గొన్నారు. ఇక ఇరుదేశాల నడుమ రక్షణ ఉత్పత్తుల రంగం, కీలక ఖనిజాలు , హై టెక్నాలజీ విషయాలపై మరింత వ్యూహాత్మక సంప్రదింపులు జరిగినట్లు అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్ ఎడతెగని ఘర్షణ అంశాలలో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఉద్రిక్తతల సడలింపునకు యత్నించాల్సి ఉందని ఇరుదేశాలు నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News