Friday, January 24, 2025

సేవలకు ఆటంకాలతో సాధించేదేముంది?

- Advertisement -
- Advertisement -

కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో మహిళల పట్ల తాలిబన్ల ఉద్యోగ ఆంక్షలపై అమెరికా నిరసన వ్యక్తం చేసింది. తాలిబన్ పాలకుల చర్యలతో చివరికి దేశంలో లక్షలాది మందికి కీలకమైన, ప్రాణరక్షక సేవలు అందించడంలో అంతరాయం ఏర్పడుతుందని విమర్శించింది. తాలిబన్ పాలకులు ఇటీవల తమ విధానాలలో భాగంగా ప్రభుత్వేతర సహాయక సంస్థలు (ఎన్‌జిఒ)లో మహిళలు ఉద్యోగాలలో చేరరాదని ఆదేశించింది. ప్రత్యేకించి విదేశీ ఎన్‌జిఒలలో ఉద్యోగినులుగా చేరితే అప్ఘన్ మహిళలకు శిక్షలు తప్పవని హెచ్చరించింది. తాలిబన్ల చేతికి గత ఏడాది అధికారం చేతిలోకి వచ్చిన నాటి నుంచి పరిస్థితులు దిగజారాయి. దేశ ఆర్థిక స్థితి చతికిల పడి లక్షలాది మంది మరింత పేదలు అయ్యారు. ఆకలి కేకలు నిరాశానిస్పృహలు ఇనుమడించాయి. మరో వైపు తాలిబన్ ప్రభుత్వంపై పలు దేశాలు తీవ్రతర ఆంక్షలు కొనసాగిస్తున్నాయి.

ఇటీల ఐరాస సర్వప్రతినిధి సభలో కూడా తాలిబన్ల పాలనకు గుర్తింపు కుదరదని తేల్చింది. బ్యాంకు ఖాతాలు స్తంభించాయి. దేశ కరెన్సీ నిల్వలు కేవలం అంతర్జాతీయ సంస్థల చెల్లింపులకు అరకొరగా ఉపయోగపడుతున్నాయి. ఈ దశలో ఎన్‌జిఒలో ఉద్యోగినుల ఆంక్షలు అనుచితం అవివేకం అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మహిళలే మానవతా సహాయ చర్యలకు ప్రధాన శక్తిగా ఉంటారని, ఈ క్రమంలో పలు దేశాలు సాయానికి ముందుకు వచ్చి స్థాపించిన ఎన్‌జిఒ సంస్థలలో బాధ్యతాయుతంగా సేవలు అందించే మహిళలపై ఉద్యోగ నిషేధాలు అవివేకం అవుతాయని బ్లింకెన్ పేర్కొన్నారు. ఎన్‌జిఒ నిషేధ చర్యలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఓ ప్రకటనలో ఖండన వెలువరించారు. అయితే ఉద్యోగినులను తీసుకునే స్వచ్ఛంద సేవాసంస్థలు తమ దేశంలో లేకుండా చేస్తామని, వాటి నిర్వాహక లైసెన్సులు రద్దు చేస్తామని ఇటీవలే అఫ్ఘన్ ఆర్థిక మంత్రి ఖ్వారీ దిన్ మెహమ్మద్ హనీఫ్ ప్రకటన వెలువరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News