Wednesday, January 22, 2025

హౌతీలపై అమెరికా, బ్రిటన్ వైమానిక దాడులు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులు చేసిన హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్ సైనికులు దాడులు చేశారు. హౌతీలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని అగ్రరాజ్యాలు హెచ్చరించాయి. ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుటను లక్యంగా చేసుకొని అమెరికా, బ్రిటన్ వైమానికి దాడులు చేసింది. హౌతీలకు సంబంధించిన డజను స్థావరాలపై దాడులు చేశామని అమెరికా పేర్కొంది. హౌతీల సైనిక సామర్థాన్ని తగ్గించేందుకు దాడులు చేశామని పేర్కొన్నాయి. వైమానిక, నౌకయాన, జలాంతర్గామి దాడులు కూడా జరుగుతాయని హెచ్చరించింది. యెమెన్ రాజధాని సనాతో పాటు సాదా, ధమర్, హోడెయిడా గవర్నరేట్లలో దాడులు జరిగినట్లు హౌతీ అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటి నుంచి పశ్చిమాసియాలో దాడులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ దేశం నుంచి 12000, పాలస్తీనా నుంచి 23000 మంది చనిపోయినట్టు సమాచారం. హౌతీలు ఇప్పటికి 27 నౌకలపై దాడి చేయడంతో అగ్రరాజ్యాలు వారిపై కన్నెర చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News