Thursday, January 23, 2025

పత్తికి మద్దతుపై అమెరికా కన్నెర్ర

- Advertisement -
- Advertisement -

America collude on Cotton Support price

అమెరికాలో ఒక్కొక్క పత్తి రైతుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రత్యక్ష, పరోక్ష సబ్సిడీ 1,17,494 డాలర్లు కాగా మన దేశంలో ఇస్తున్న పరోక్ష సబ్సిడీ కేవలం 27 డాలర్లు మాత్రమే. ఈ మొత్తాన్ని కూడా ఇవ్వకూడదని వత్తిడి తెస్తోంది. అమెరికాలో ఉన్నచట్టాల ప్రకారం మద్దతు ధర, మార్కెట్లో దాని కంటే రైతులకు తక్కువ వస్తే ఆ మేరకు ప్రభుత్వం లెక్క కట్టి నగదు చెల్లిస్తుంది. అదిగాక రైతులకు సబ్సిడీలతో కూడిన రుణాలు, బీమా సబ్సిడీ నేరుగా ఇచ్చే రాయితీలు ఇలా ఉన్నాయి. 1995 2020 సంవత్సరాలలో 40.10 బిలియన్ డాలర్లు సబ్సిడీల రూపంలో చెల్లించారు. రైతులకు జిన్నింగ్ ఖర్చు తగ్గించే పేరుతో 3.16 బిలియన్ డాలర్లు ఇచ్చారు. ఈ సబ్సిడీల కారణంగా ప్రపంచంలో పత్తి ధరలు పతనమయ్యాయి. 1995లో పౌను పత్తి ధర 98 సెంట్లు ఉండగా 2001లో 48 సెంట్లకు తగ్గి 2020లో 70 సెంట్లు ఉంది. అంటే పాతిక సంవత్సరాల్లో మొత్తంగా పత్తి ధరలు తగ్గాయి. ఎగుమతులపై ఆధారపడిన అమెరికాలో ఏ పత్తి రైతూ బలవన్మరణానికి పాల్పడిన ఉదంతాలు లేవు.

ఈ ఏడాది పత్తికి మంచి ధర వచ్చిందని రైతులు సంతోషపడ్డారు. వివిధ కారణాలతో పంట దిగుబడి తగ్గిం ది, ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. కనుక ధర పెరిగినా రైతులకు సంతోషం లేకుండా పోయింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా గణనీయంగా ధరలు పెరిగాయి. ఇప్పుడున్న ధరలు వచ్చే ఏడాది ఉంటాయనే సూచనలు లేవు. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం అమెరికా ముందస్తు మార్కెట్‌లో మార్చి నెలలో ఒక పౌండు (454 గ్రాములు) దూది ధర 125.66 సెంట్లు (ఒక డాలరుకు వందసెంట్లు)గా ఉంది. మే నెలలో 123.20, వచ్చే ఏడాది జూలైలో 120.51, అక్టోబరులో 109.75, డిసెంబరులో 105.27 సెంట్లుగా ఉంది. ఉత్పత్తి, గిరాకీ, వినియోగం తదితర అంశాల ఆధారంగా అంతర్జాతీయ, జాతీయ మార్కెట్ శక్తులు ధరలను నిర్ణయిస్తాయి.
న్యూయార్క్ ముందస్తు మార్కెట్లో మార్చి నెల ధర 115 నుంచి 127 సెంట్ల వరకు పెరిగింది. చైనాలో 160163 సెంట్ల మధ్యఉంది. మన దేశంలో నాణ్యమైన పొడవు పింజ రకం శంకర్ 6 రకం ధర 126 నుంచి 133 సెంట్లకు పెరిగింది. పాకిస్ధాన్‌లో 127 నుంచి 140 డాలర్లకు పెరిగింది. పంజాబ్ ఒక మండ్ (37.324 కిలోలు) ధర ఎనిమిది వేల రూపాయలకు అటూ ఇటూగా ఉంది. అదే పాకిస్థాన్‌లో రూ. 8,900 వరకు ఉంది. పత్తి పండించే ప్రధాన దేశాలన్నింటినీ పోల్చినపుడు మన దేశంలోనే ధరలు తక్కువగా ఉన్నాయి. మార్కెట్ ధరలను బట్టే రైతులకూ చెల్లింపు ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఎగుమతులకు డిమాండ్ ఉండటంతో నూలు మిల్లర్లు ఎగబడి కొనుగోలు చేశారు.
అమెరికా వ్యవసాయశాఖ సమాచారం ప్రకారం ప్రపంచ పత్తి ఉత్పత్తి 8,03,000 బేళ్లు తగ్గి 120.2 మిలియన్ బేళ్ల వద్ద ఉంది. ఇదే సమయంలో మిల్లు వినియోగం 1,86,000 పెరిగి 124.4 మి. బేళ్లని పేర్కొన్నది. 202122 88.7 మి. బేళ్ల నిల్వలతో ప్రారంభమై 84.3 మి. బేళ్లతో ముగియనున్నట్లు అంచనా వేసింది. ఈ కారణంగానే ప్రపంచమంతటా పత్తి ధరలు పెరిగాయి. భారత్‌లో ఐదు లక్షల బేళ్లు తగ్గి ఉత్పత్తి 27మి. బేళ్లుగా ఉందని అమెరికా పేర్కొన్నది. ప్రపంచంలో పత్తి దిగుమతులు 46.4 మి. బేళ్లని, చైనా దిగుమతులు రెండున్నర లక్షలు తగ్గి 9.5మి. బేళ్లు దిగుమతి ఉంటుందని పేర్కొన్నది. వివిధ దేశాల్లో పత్తి చేతికి వచ్చే తరుణం ఒకే విధంగా లేనందున అంతిమంగా లెక్కల ఖరారులో అంకెలు మారతాయి. మన దేశంలో ధరలు పెరుగుతున్న కారణంగా ధనిక రైతులు మరింతగా పెరుగుదలను ఆశించి మార్కెట్‌కు పూర్తిగా తీసుకురావటం లేదని వ్యాపారులు చెబుతున్నారు. చెనాలో కూడా ఇదే పరిస్ధితి ఉంది. అమెరికా, ఐరోపా దేశాల్లో ద్రవ్యోల్బణం కారణంగా ధరలు పెరిగి గిరాకి తగ్గినందున పత్తి ధరలు అదుపులో ఉన్నాయని లేనట్లయితే మరికొంత పెరిగేవన్నది ఒక అభిప్రాయం. గతంతో పోలిస్తే ప్రస్తుతం ధరలు పెరిగినందున 202223లో ప్రపంచమంతటా సాగు పెరగవచ్చని జోస్యం చెబుతున్నారు.
స్ధానికంగా ఉత్పత్తి తగ్గటం, మిల్లు డిమాండ్ పెరగటంతో ఈ ఏడాది మన పత్తి ఎగుమతులు పెద్దగా లేవు. దాంతో సాంప్రదాయంగా మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే దేశాలు వేరే మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశం నుంచి పరిమితంగా బంగ్లాదేశ్‌కు ఎగుమతులు జరుగుతున్నాయి. ఒక పౌను ధర 135 సెంట్ల వరకు ఉంది. గతేడాది మన దేశం 78 లక్షల బేళ్లను ఎగుమతి చేయగా ఈ ఏడాది 40 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. గతేడాది పత్తి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం 10 శాతం దిగుమతి పన్ను విధించింది. పన్ను ఎత్తివేస్తే పెద్ద మొత్తంలో దిగుమతులు పెరిగి స్ధానిక ధరలు పడిపోయి ఉండేవి. దిగుమతి పన్ను ఎత్తివేయాలని మిల్లర్లు వత్తిడి తెస్తున్నారు. ముడిసరకుల ధరలు పెరుగుతున్నందున పత్తిపై దిగుమతి పన్ను రద్దుతో పాటు దిగుమతులపై పరిమాణాత్మక ఆంక్షలను తొలగించాలని కోరుతున్నారు.
వ్యాపారుల అంచనా ప్రకారం సెప్టెంబరు 30తో ముగిసిన పత్తి సంవత్సరంలో గతేడాది కంటే పది లక్షల బేళ్లు తగ్గింది. ఉత్పత్తి 350 లక్షల బేళ్లకు అటూ ఇటూగా ఉంటుండగా ప్రతి ఏడాది 4045 లక్షల బేళ్లు వినియోగానికి పనికి రాదని, ఈ ఏడాది ఈ సమస్యతో పాటు దిగుబడి తగ్గిందని, గతేడాది అక్టోబరు ఒకటిన కాండీ ధర రూ. 43,300 ఉంటే జనవరికి రూ. 57 వేలకు తరువాత రూ. 80వేలకు చేరినట్లు దక్షిణాది మిల్లుల ప్రతినిధి రవిశావ్‌ు చెప్పారు. పన్నులేని పత్తిని 30 లక్షల బేళ్ల వరకు దిగుమతికి అనుమతించాలని అన్నారు. ఈ ఏడాది ధరల కారణంగా వచ్చే సంవత్సరం పత్తి సాగు 20 25శాతం పెరగవచ్చని కాటన్ అసోసియేషన్ పేర్కొన్నది. పొడవు పింజ రకాలకు కనీస మద్దతు ధర 25 శాతం, ఇతర రకాలకు 35 శాతం మాత్రమే పెంచాలని మిల్లుల వారు చెబుతున్నారు. 2021 22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మధ్యరకం పింజ రకాల మద్దతు ధరను క్వింటాలుకు రూ. 5,726, పొడవు పింజకు రూ. 6,025గా నిర్ణయించింది. ఇవి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రూ.211, 200 ఎక్కువ.
ఈ ఏడాది పత్తి మార్కెట్ ధరలతో పోల్చి చూస్తే కనీస మద్దతు ధరలు తక్కువే అన్నది స్పష్టం. అవి సాగు ఖర్చులను ప్రతిబింబించటం లేదు. ఈ ధరలను కూడా ప్రకటించటానికి వీల్లేదని మన సహజ భాగస్వామిగా నరేంద్ర మోడీ వర్ణించిన అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్దలో మన దేశం మీద కేసులు దాఖలు చేశాయి. వాటిని సంతుష్టీకరించేందుకు గాను కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించేందుకు మోడీ సర్కార్ మొరాయిస్తున్నది. అసలు మొత్తంగా ఎంఎస్‌పిని నీరు గార్చేందుకు మూడు సాగు చట్టాలను తెచ్చి రైతాంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు పూనుకున్న అంశం తెలిసిందే. అమెరికా ఇస్తున్న భారీ సబ్సిడీలతో మనతో పాటు చిన్న దేశాలైన ఆఫ్రికన్ రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది. 2020 లెక్కల ప్రకారం ప్రపంచ పత్తి ఎగుమతుల్లో అమెరికా వాటా 35 శాతం. అక్కడ జరిగే ఉత్పత్తిలో 85.6 శాతం ఎగుమతులు చేస్తున్నది. అందువలన తనకు పోటీ వచ్చే మన వంటి దేశాలను దెబ్బ తీసేందుకు అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనల పేరుతో దాడి చేస్తున్నది. కనీస మద్దతు ధర నిర్ణయాన్ని సబ్సిడీ చెల్లించటంగా చిత్రిస్తున్నది. నిజానికి మార్కెట్లో అంతకంటే ఎక్కువ ధరలు ఉన్నపుడు ప్రభుత్వ సంస్ధ సిసిఐ కొనుగోళ్లు జరపటం లేదు. జరిపినా ఎంఎస్‌పికి కొనుగోలు చేస్తున్నది తప్ప కేంద్ర ప్రభుత్వం ఎలాంటి బోనస్ ఇవ్వటం లేదు.
అమెరికాలో ఒక్కొక్క పత్తి రైతుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రత్యక్ష, పరోక్ష సబ్సిడీ 1,17,494 డాలర్లు కాగా మన దేశంలో ఇస్తున్న పరోక్ష సబ్సిడీ కేవలం 27 డాలర్లు మాత్రమే. ఈ మొత్తాన్ని కూడా ఇవ్వకూడదని వత్తిడి తెస్తోంది. అమెరికాలో ఉన్నచట్టాల ప్రకారం మద్దతు ధర, మార్కెట్లో దాని కంటే రైతులకు తక్కువ వస్తే ఆ మేరకు ప్రభుత్వం లెక్క కట్టి నగదు చెల్లిస్తుంది. అదిగాక రైతులకు సబ్సిడీలతో కూడిన రుణాలు, బీమా సబ్సిడీ నేరుగా ఇచ్చే రాయితీలు ఇలా ఉన్నాయి. 1995 2020 సంవత్సరాలలో 40.10 బిలియన్ డాలర్లు సబ్సిడీల రూపంలో చెల్లించారు. రైతులకు జిన్నింగ్ ఖర్చు తగ్గించే పేరుతో 3.16 బిలియన్ డాలర్లు ఇచ్చారు. ఈ సబ్సిడీల కారణంగా ప్రపంచంలో పత్తి ధరలు పతనమయ్యాయి. 1995లో పౌను పత్తి ధర 98 సెంట్లు ఉండగా 2001లో 48 సెంట్లకు తగ్గి 2020లో 70 సెంట్లు ఉంది. అంటే పాతిక సంవత్సరాల్లో మొత్తంగా పత్తి ధరలు తగ్గాయి. ఎగుమతులపై ఆధారపడిన అమెరికాలో ఏ పత్తి రైతూ బలవన్మరణానికి పాల్పడిన ఉదంతాలు లేవు.
అమెరికా ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని 2003 నుంచి అనేక దేశాలు వత్తిడి చేస్తున్నా ఫలితం కనిపించటం లేదు.1986 88లో ఉన్న సబ్సిడీల ఆధారంగా ఇప్పటికీ సబ్సిడీలను లెక్కిస్తున్నారు. అమెరికా తన సబ్సిడీలను డాలర్లలో చెబుతుండగా మన సబ్సిడీలను రూపాయల్లో లెక్కించి చూశారా ఎంత ఎక్కువ ఇస్తున్నారో అని కేసులు దాఖలు చేశారు. నాడు మన దేశంలో కనీస మద్దతు ధర అంతర్జాతీయ ధరల కంటే తక్కువగా ఉంది. 198688 మధ్య తమ పత్తి సబ్సిడీ 2,348 మి. డాలర్లని గాట్ చర్చల్లో అమెరికా చెప్పింది. కానీ 1986లో 1,702 మి. డాలర్లని దాన్నే ప్రమాణంగా తీసుకోవాలని తొండి చేస్తోంది. ఈ తప్పుడు లెక్కల కారణంగా 19 బి. డాలర్లు అదనంగా ఇచ్చిన సొమ్మును దాచి పెడుతోంది. ఈ వివాదం ఇంకా తేలలేదు. ప్రపంచ వాణిజ్య సంస్ధను, అమెరికా వంటి ధనిక దేశాలను సంతృప్తిపరచేందుకు మోడీ సర్కార్ చూపుతున్న శ్రద్ధ మన రైతాంగం మీద కనిపించటం లేదు.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News