Monday, December 23, 2024

డల్లాస్‌లో కాల్పులు…. 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికా దేశం టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌లో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. అలెన్‌లోని ప్రీమియర్ మాల్‌లో దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో ఎనిమిది మంది చనిపోగా ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.36 గంటలకు దుండగుడు కాల్పులు జరుపుకుంటూ మాల్‌లోకి ప్రవేశించాడు. ఇప్పటికే అమెరికాలో గనకల్చర్‌కు చాలా మంది బలవుతున్నారు. ప్రతి రోజు ఏదో ఒక దగ్గర కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.

Also Read: సన్‌రైజర్స్ రాత మారేనా?.. నేడు రాజస్థాన్ తో కీలక పోరు

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News