Monday, January 20, 2025

ఈ నెలలో భారత్ రానున్న అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో మంత్రుల స్థాయి చర్చలు జరపడానికి ఈ నెలలో భారత్‌కు వెళతారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. నవంబర్ 2నుంచి 10వ తేదీ వరకు జరిపే వారం రోజుల పర్యటన చివర్లో బ్లింకెన్ భారత పర్యటన ఉంటుందని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజుల పర్యటనలో భాగంగా బ్లింకెన్ మొదట ఇజ్రాయెల్, జోర్డాన్‌లలో పర్యటిస్తారు. అనంతరం ఆయన ఇండో పసిఫిక్ ప్రాంత పర్యటనలో భాగంగా జపాన్, దక్షిణ కొరియా, భారత్‌లలో పర్యటిస్తారు. ఈ దేశాల్లో బ్లింకెన్ పర్యటనకు సంబంధించిన కచ్చితమైన తేదీలను ఇంకా ప్రకటించలేదు. అమెరికా ప్రతినిధి బృందం న్యూఢిల్లీలో 2+ 2 మంత్రుల స్థాయి చర్చల్లో పాల్గొంటుందని మిల్లర్ చెప్పారు.

ఈ ప్రతినిధి మృందం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర సీనియర్ అధికారులతో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలతో పాటుగా ఇండోపసిఫిక్ ప్రాంతంలో పరిణామాలపై చర్చిస్తుందని ఆయన తెలిపారు.బ్లింకెన్ గురువారం ఇజ్రాయెల్‌కు బయలుదేరి వెళ్తున్నారు. ఇజ్రాయెల్, జోర్డాన్‌లలో బ్లింకెన్ తనను తాను కాపాడుకోవడానికి ఇజ్రాయెల్‌కు ఉన్న హక్కుకు అమెరికా మద్దతును పునరుద్ఘాటించడంతో పాటుగా ఇజ్రాయెల్, వెస్ట్‌బ్యాంక్, గాజా ప్రాంతాల్లో అమెరికా పౌరుల రక్షణకు చేయాల్సిన కృషిపై చర్చిస్తారని, అలాగే బందీలను తక్షణం విడిచిపెట్టేలా చూడడానికి కృషి చేస్తారని, పాలస్తీనా పౌరులకు పంపిణీ చేయడం కోసం మానవతా సహాయం గాజాలోకి ఎలాంటి అడ్డంకులూ లేకుండా చేరుకునేలా చూసే విషయమై చర్చలు జరుపుతారని మిల్లర్ తెలిపారు. ఈ రెండు దేశాల పర్యటన తర్వాత బ్లింకెన్ తన ప్రతినిధి బృందంతో టోక్యో, సియోల్, న్యూఢిల్లీలకు వెళ్తారని ఆ ప్రకటన తెలిపింది. టోక్యోలో బ్లింకెన్ 2023 సంవత్సరంలో జి20 దేశాల విదేశాంగ మంత్రుల రెండో సమావేశంలో పాల్గొంటారని, అలాగే జపాన్ ప్రధాని కిషిడా ఫుమియో, విదేశాంగ మంత్రి కమికవా యోకోతో కూడా చర్చలు జరుపుతారని మిల్లర్ ఆ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News