Tuesday, November 5, 2024

కరోనాపై పోరులో భారత్‌కు అమెరికా అండదండలు

- Advertisement -
- Advertisement -

America help for India in war on corona:Kamala Harris

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ వెల్లడి

వాషింగ్టన్ : భారత్‌లో కరోనా కల్లోలం హృదయ విదారకమని, బైడెన్ పాలనాయంత్రాంగం అంతా కరోనాపై పోరులో భారత్‌కు అండగా ఉండడానికి సిద్ధంగా ఉందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ స్పష్టం చేశారు. భారత్ సంక్షేమమే అమెరికా కు చాలా కీలకమని ఆమె పేర్కొన్నారు. అమెరికా కొవిడ్ రిలీఫ్ ఫర్ ఇండియా అనే కార్యక్రమం సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడారు. కరోనా ప్రారంభంలో తమ దేశం లోని పడకలు కరోనా రోగులతో నిండిపోయినప్పుడు భారత్ సహాయం అందించిందని, ఈనాడు ఆపద లోని భారత్‌ను ఆదుకోడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పారు. మిత్రులుగా, క్వాడ్ సదస్సు సభ్యులుగా ప్రపంచ సమాజంలో ఒక భాగంగా తాము ఈ సహాయం అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. భారత సంతతి అమెరికన్లు అందిస్తున్న సహాయాన్ని ఆమె ప్రశంసించారు. మా కుటుంబానికి చెందిన ముందు తరాల వారు భారత్ నుంచి వచ్చారని మీలో చాలా మందికి తెలుసు.

నా తల్లి భారత్ లోనే పుట్టి పెరిగింది. ఇప్పటికీ భారత్‌లోతమ కుటుంబానికి చెందిన వారున్నారు అని ఆమె భారత్‌తో తనకున్న సంబంధాన్ని వివరించారు. కరోనా కేసులు విపరీతంగా పెరగడం, అనేక లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని, ఆయా కుటుంబాలకు తాను సంతాపం తెలుపుతున్నానని ఆమె చెప్పారు. పరిస్థితి మరింత తీవ్రమైతే తమ యంత్రాంగం రంగం లోకి దిగుతుందని ఆమె అన్నారు. ఆక్సిజన్ సిలిండర్లను పంపామని, మరిన్ని పంపిస్తామని, అలాగే ఎన్95 మాస్క్‌లు , రెమ్‌డెసివిర్ డోసులు పంపామని చెప్పారు. సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ అఫైర్స్ బ్యూరో సీనియర్ అడ్వైజర్ ఎర్విన్ మసింగా మాట్లాడుతూ భారత్‌కు చేయగలిగిన సాయం అమెరికా చేస్తోందని, భారత్ లోని కరోనా బాధితులను ఆదుకోడానికి అమెరికా ప్రజలు శక్తి సామర్ధాలతో ముందుంటారని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News