Saturday, November 9, 2024

జన ‘భారతం’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ/న్యూయార్క్: మన దేశం విశ్వం సాక్షి గా ‘జన భారతం’గా ఆవిర్భవించింది. పొరుగున ఉన్న చైనాను తోసిరాజంటూ ప్రపంచంలో అత్యధి క జనాభా గల దేశం అయింది. జనాభాపరంగా ఇది ప్రపంచ ఐక్యరాజ్య సమితి తాజా జనాభా సూచీ మేరకు ఇప్పుడు భారతదేశంల జనాభా దాదాపుగా 142 కోట్ల 86 లక్షలు (142.86 కోట్లు) అయింది. ఇక పనిశక్తి వయస్సులోని వారు అత్యధికులుగా ఉన్నారు. పైగా పాతిక కోట్ల వరకూ యువశక్తి ఉండటం కీలక పరిణా మం అయింది. ప్రపంచ సంస్థ లెక్కల ప్ర కారం చైనా ప్రస్తుత జనాభా 142.57 కోట్లు గా నమోదైంది. ఈ విధంగా ఇండియా చైనా ను జనాభా విషయంలో దాదాపు 29 లక్షల తో వెనకకు నెట్టివేసింది. 34 కోట్ల జనాభాతో అమెరికా మూడోస్థానంలో నిలిచింది.

ఇక భారతదేశపు జనాభాలో 68 శాతం వరకూ మంది పనిచేసే వయోపరిమితి దశలో అంటే 15 ఏండ్లు నుంచి 64 ఏండ్ల మధ్యలో ఉన్నా రు. ఇంతవరకూ చైనా ప్రపంచంలో అత్యంత జనాభా దేశంగా ఉండగా, ఇప్పుడు రెండోస్థానంలోకి దిగజారింది. సంబంధిత వివరాలను గణాంకాలతో పాటు ఐరాసకు చెందిన జనా భా నిధి (యుఎన్‌ఎఫ్‌పిఎ) బుధవారం తమ గణాంక సూచీల ద్వారా తెలిపింది. ఇక జనాభాలో ప్రపంచంలో అగ్రగామి అయిన ఇండియాలో 25 శాతం వరకూ అప్పుడే పుట్టిన నుంచి 14 ఏండ్ల లోపు వారున్నారు. 18 శాతం వరకూ 10 ఏండ్ల నుంచి 19 ఏండ్లు, 26 శాతం వరకూ 10 నుంచి 24 ఏండ్లు, 68 శాతం వరకూ 15 నుంచి 64 ఏండ్లలోపు వారున్నారు. ఇక 65 ఏండ్లు దాటిన వయోవృద్ధుల సంఖ్య 7 శాతంగా ఉందని జనాభా నిధి లెక్కలతో స్పష్టం అయింది.
25కోట్ల శక్తిగా యువజనం
15 నుంచి 24 ఏండ్ల లోపు వారు 25.4 కోట్ల మంది వరకూ భారతదేశపు జనాభాలో ఉన్నారు. ఈ విధంగా గణనీయమైన యువ శక్తి భారతదేశానికి వజ్రాయుధమే కానుంది. పలు వినూత్న ఆవిష్కరణలు, ఆలోచనలు, దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు వంటివి ఈ యువత నుంచి ఆశించే వీలుందని జనాభా నిధి భారతీయ ప్రతినిధి ఆండ్రియా వోజ్‌నార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ దేశానికి ఇంత పెద్ద సంఖ్యలో యువశక్తి ఉండటం పలు వినూత్న మార్పులకు దారితీస్తుంది. ప్రత్యేకించి దేశంలోని మహిళలకు తగు విధంగా విద్యా, నైపుణ్య అవకాశాలు కల్పిస్తే, వారికి సాంకేతిక, డిజిటల్ వినూత్నతలో భాగస్వామ్యం చేసుకుంటే నిర్ణీత పురోగతి లక్షం సార్థకం అవుతుందని ఈ మహిళా ప్రతినిధి ఈ జనాభా సంఖ్య నేపథ్యంలో తెలిపారు. యువతను ప్రగతి పథంలో సరైన విధంగా సమ్మిళితం చేసుకుంటే , ఈ క్రమంలో మహిళా శక్తిని గణనీయంగా వాడుకుంటే ప్రగతివేగం మరింత పెరుగుతుందని తెలిపారు. ఐరాస తెలియచేసిన ఇండియా రిపోర్టు మేరకు ఇప్పుడు పెరిగిన జనాభా క్రమంలో మహిళలకు పలు విషయాలపై మరింత పరిజ్ఞానం పెంపొందింపచేయాల్సి ఉంటుంది.

వారికి సంబంధించి సంతానోత్పత్తి హక్కులు, వారి ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యతలు కల్పించడం అత్యవసరం. మొత్తం మీద పాతిక కోట్లకు పైగా ఉండే యువశక్తిని సరైన విధంగా దేశం కోసం నిర్మాణాత్మకంగా వినియోగించుకోవడం జరిగితే అత్యధిక జనాభా దేశం అనే స్థానానికి సార్థకత దక్కుతుందని విశ్లేషకులు తెలిపారు. ఏ దేశంలో అయిన మహిళల శారీరక సౌష్టవం, బాలికలకు సంబంధించి ఎప్పటికప్పుడు వారికి హక్కుల గురించి తెలియచేయడం అత్యవసరం . దేశ సమ్మిళిత ప్రగతికి ఇప్పటి ఇంతటి జనాభా దశ నిర్ణాయాత్మకం అవుతుంది. అయితే తీసుకునే సంకల్పాలు , నిర్ణయాలే ఈ నిర్ణాయాత్మకతకు పరిపుష్టత కల్పిస్తాయి. యువతలో కృతనిశ్చయం పట్టుదలలు పెంచితే వారిని దేశ ప్రగతికి సరైన విధంగా వాడుకోవడం జరిగితే ఇక దేశానికి తిరుగుండదని స్పష్టం చేశారు. వ్యక్తిగత హక్కులు, వ్యక్తిగత అభిరుచులను గౌరవించాల్సి ఉంటుంది. ప్రత్యేకించి యువత వారి ఇష్టమైన విద్యా వృత్తిని ఎంచుకునేందుకు ప్రోత్సహించాల్సి ఉంటుంది. అన్నింటికి మించి సంతానోత్పత్తి దశలో ఉండే యువత తాము ఎప్పుడు పిల్లలను కావాలనుకుంటున్నామనేది ఎంచుకునే వీలుండాలి.

పిల్లలను ఎప్పుడు కనాలి, కంటే ఎంత మందిని కనాలనేది యుక్త వయస్కులైన దంపతులు ఎంచుకునే వీలుండాలి. ఈ రీతిలో శాస్త్రీయతతో వారు వ్యవహరించేలా వారికి తగు విధంగా అవగావహన కల్పించాలి లేకపోతే ఈ యువశక్తి తమ భవితను మల్చుకునే స్థాయిలో ఇతరత్రా తిరోగమనానికి దారితీసే వీలుందని ఐరాస ప్రతినిధి తెలిపారు. ఇక మహిళలు ప్రత్యేకించి బాలికలను కూడా దేశ జాతీయ సంతాన విధానాలు, కార్యక్రమాలు అంటే కుటుంబ సంక్షేమ పరిధిలోకి వచ్చే విషయాలలో కేంద్రీకృతస్థానంలో పెట్టాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కడైతే హక్కులు, వ్యక్తుల ఇష్టాయిష్టాలను మన్నించడం, ప్రజలందరి సమానత పట్ల గౌరవం ఉంటుందో అప్పుడు అక్కడ నిర్ణీత సముజ్వల భవితను ఆవిష్కరించుకునే వీలుంటుంది. లేకపోతే ప్రగతి దారులు తెరుచుకోవడం అసాధ్యం అవుతుంది. అంతేకాకుండా అత్యంత భారీ సంఖ్యలో ఉండే యువజనం , ఏదైనా చేయగలిగే శక్తితో ఉండే యువతరం తాము అనుకున్నది ఏదైనా చేసేందుకు వీలుంటుందని పరోక్షంగా హెచ్చరించారు.
2050 నాటికి 165 కోట్ల వరకూ భారత్ జనాభా
ఇప్పటి అత్యధిక జనాభా ఇతరత్రా విషయాలను పరిశీలించుకుని వివిధ సంస్థలు భారతదేశంలో జనాభా వచ్చే 30 ఏండ్లలో పెరుగుతూ పోయి 165 కోట్లకు చేరుతుంది. ఆ తరువాత క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. అత్యధిక సంఖ్యలో పనిచేసే వయస్సులో ఉన్న వారు ఇండియాలో ఉండటం, సరైన అవకాశాలను కల్పించగలిగితే దేశం ఆర్థికంగా ముందుకు దూసుకుపోయ్యే ఉత్పత్తి సామర్థాన్ని సంతరించుకునేందుకు దారితీస్తుందని విశ్లేషకులు తెలిపారు. భారతదేశంలో జనాభా స్వరూపం గురించి విశ్లేషించుకుంటే రాష్ట్రాల వారిగా తేడాలు ఉన్నాయి. కేరళ, పంజాబ్‌లలో అత్యధికంగా వయోవృద్థులు ఉన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో యువజనాభా అంటే పనిచేసే స్థాయి స్తోమత గల వయస్సు వారు ఎక్కువగా ఉన్నారని వెల్లడైంది.
ప్రపంచ జనాభా 804 కోట్లకు పైగా
ప్రపంచ జనాభా ఇప్పుడు 804.5 కోట్లుకు చేరుకుంది. ఇందులో మూడింట ఒకవంతు వరకూ భారత్ చైనాలోనే జనం ఉన్నారు. ఇటీవలి కాలంలో భారత్ చైనాల్లో జనాభా సంఖ్యాపరంగా దోబూచులాట ఉంది. చైనాలో ఈ మధ్యకాలంలో జనాభా సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇదే క్రమంలో ఇండియాలో పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News