Monday, December 23, 2024

అమెరికా ఆదుకోవాలి

- Advertisement -
- Advertisement -

America must support:Zelensky

దిగ్బంధంలో దయనీయస్థితి, నో ఫ్లై జోన్ ప్రకటించాలి, ప్రతిక్షణం 9/11నాటి
దుస్థితి అనుభవిస్తున్నాం: అమెరికా కాంగ్రెస్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి

కీవ్/ వాషింగ్టన్ : రష్యా దళాల అతిక్రమణ ఆక్రమణం చివరికి తమ రాజధాని కీవ్ దిశగా సాగుతోందని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో ఆయన బుధవారం అమెరికా చట్టసభలను ఉద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ప్రసంగించారు. అమెరికా ఉభయసభల సంయుక్త సమావేశంలో ఉక్రెయిన్ నేత ప్రసంగించడం ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలలో ప్రధాన అంశం అయింది. రష్య సేనల నుంచి దిగ్బంధం అయి ఉన్న దేశ రాజధాని కీవ్ నుంచి వీడియోలింక్ ద్వారా ఉక్రెయిన్ అధినేత ప్రసంగించారు. ఇప్పుడు తమను అమెరికా మరింతగా ఆదుకోవల్సి ఉందన్నారు. ఆక్రమణలకు దిగుతోన్న రష్యాకు వ్యతిరేకంగా మరింత ఉధృతస్థాయిలో వ్యవహరించాల్సి ఉందన్నారు. పౌరులకు ప్రాణాపాయ స్థితి ఏర్పడుతోంది. నలు దిక్కుల నుంచి రష్యా సేనలు చుట్టుముడుతున్న దశలో పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు. దిక్కుతోచనిస్థితి ఉంది. అంతర్జాతీయ కట్టుబాట్లను, మానవీయ విలువలను పక్కకు పెట్టి రష్యా భీకర దాడి సాగిస్తోంది.

ఈ దశలో ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్రైజోన్‌గా ప్రకటించాలని, ఇంతకు ముందు అమెరికాలో సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడుల దశలో తీసుకున్న చర్యలను ఇప్పుడు పాటించాల్సి ఉందని, ఈ డిమాండ్ అమలులోకి వచ్చేలా చూడాలని చట్టసభల సభ్యులకు, బైడెన్ అధికార యంగ్రాంగానికి ఆయన విజ్ఞప్తి చేశారు. రష్యా విధ్వంసపు వీడియోను చూడండంటూ ఆయన సెనెటర్లు, ప్రతినిధులకు సవివర వీడియో ప్రదర్శించారు. యుద్ధం మొదలయ్యి మూడు వారాలు పై బడింది. వందలాది వేలాది ఉక్రెయిన్లు నిర్వాసితులు అయ్యారు. ఎందరో దుర్మరణం చెందారు. యూరప్ గత 80 ఏండ్లలో ఎప్పుడూ ఎక్కడా చూడని ఉగ్ర ఉన్మాదం ఇక్కడ నెలకొందన్నారు. పిరల్ హార్బర్‌లో 1941 డిసెంబర్ 7వ తేదీన అక్కడి ఆకాశం దాడికి దిగిన విమానాలతో మసకబారిన దృశ్యాలు తరువాత అది రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా పాలుపంచుకునే ఘట్టానికి దారితీయడం వంటివి సభ్యులు గుర్తుతెచ్చుకోవాలన్నారు.

ఇటువంటి పరిణామాలు, భయానక ఘటనలు ఇప్పుడు తమ దేశం రోజూ అనుభవిస్తోందన్నారు. 2001 సెప్టెంబర్ 11ను తల్చుకోండి. అప్పుడు ఓ దుష్టశక్తి ఇక్కడి నగరాలలోకి చొచ్చుకునే వచ్చేలా దాడికి దిగింది. స్వాతంత్య్ర ప్రాంతాలను యుద్ధ క్షేత్రాలుగా చేసేందుకు పావులు కదిపిందని తెలిపారు. 1941లో విన్‌స్టన్ చర్చిల్ కాంగ్రెస్‌ను ఉద్ధేశించి ప్రసంగించిన తరువాత ఓ విదేశీ నేత నాటకీయ ఉద్రిక్త పరిస్థితుల నడుమ మాట్లాడటం వీడియో అనుసంధాన ప్రసంగం చేయడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ గగనతల పరిరక్షణకు వెంటనే నో ఫ్ల్రైజోన్ (ఎన్‌ఎఫ్‌జడ్) ఏర్పాటు కావల్సి ఉందన్నారు. తనకు ఓ కల ఉందని. ఇప్పుడు తాను చెప్పబోయేదేమిటి? తన మాటలు పదాలు ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడి వారందరికీ తెలుసు. నేను మా దేశ ఆకాశాన్ని ప్రజలను నేలను రక్షించాలనుకుంటున్నా. ఈ దిశలో అమెరికా నిర్ణయం కీలకం, ఇక్కడి సాయం అనివార్యం అని తెలిపారు. తన కలను నెరవేరుస్తారా? రష్యన్ల దాడులతో కూలేలా చేస్తారా ? తేలాల్సి ఉందన్నారు.

ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షులు నేరుగా అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌ను ఉద్ధేశించి మాట్లాడుతూ ఆయన ప్రపంచ శాంతి నేత కావాల్సి ఉందన్నారు. ఉక్రెయిన్లు పిల్లాపాపలతో ఉన్న చోటను వదిలిపెడుతున్నారు. భవనాలు ద్వంసం అవుతున్నాయి. గాయపడ్డ వారు తల్లడిల్లుతున్నాయి. ఇది ఇప్పటి దృశ్యం తన తుది విన్నపం ఒక్కటే గగనతల నిషేధం ఇందుకు అమెరికా చర్యలు అత్యవసరం అన్నారు. ఈ దిశలో ఇప్పటివరకూ అమెరికా నాటో అధికారులు సరిగ్గా స్పందించడం లేదని ఉక్రెయిన్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ కోరుతున్నట్లు నో ఫ్లై జోన్‌ను కల్పించలేకపోతున్నారు. అణ్వాయుధ రష్యాతో నేరుగా నాటో అమెరికా తలపడేందుకు సిద్ధంగా లేకపోవడం ఇప్పటి పరిస్థితికి దారితీసింది. యుఎస్ క్యాపిటల్ కాంప్లెక్స్ నుంచి జెలెన్‌స్కీ ప్రసంగానికి సభ్యుల నుంచి భారీ ఎత్తున చప్పట్లతో స్పందనలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌కు దాదాపుగా 14 బిలియన్ డాలర్ల, మానవీయ, సైనిక సాయానికి ఈ దశలోనే సభ ఆమోదం తెలిపింది.

పుతిన్‌పై యుద్ధ నేరాల విచారణ
అమెరికా సెనెట్ తీర్మానం

రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌పై యుద్ధ నేరాల పరి ధిలో దర్యాప్తు సంబంధిత తీర్మానానికి అమెరికా సెనెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్‌పై ఇప్పటి దా డులలో పుతిన్ ఆయన అధికార యంత్రాంగం దారు ణాలకు దిగుతోందని పేర్కొంటూ వెంటనే దీని నిజాల నిగ్గ తేల్చాల్సి ఉందని తీర్మానంలో తెలిపారు. యుద్ధ నేరాలను తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామని, ఇవి మానవతపై దాడులని పేర్కొన్నారు. పుతిన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం విచా రణ జరపాల్సి ఉంది. ఆయనతో పాటు ఆయన భద్రతా వ్యవస్థ,సైనిక నేతలపై కూడా యుద్ధ నేరాల పరిధిలో న్యాయస్థానానికి లాగాల్సి ఉందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News