- Advertisement -
వాషింగ్టన్: ఓమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు అమెరికా ఆరోగ్య అధికారులు శుక్రవారం కొత్త యాంటీబాడీ డ్రగ్‌కుఆమోదం తెలిపారు. కొవిడ్19 తాలూకు తేలికపాటి నుండి మితమైన కేసులు ఉన్న పెద్దలు, కౌమార రోగులకు ఈ ఎలి లిల్లీ ఔషధాన్ని అనుమతించారు. ఇదిలావుండగా ఈ ఔషధానికి ఆమోదం లభించక ముందే బైడెన్ పాలకవర్గం ఆరు లక్షల డోసులను కొనుగోలు చేసి, స్టేట్ హెల్త్ అధికారులకు సప్లయ్ చేసింది. “వైరస్ కొత్త వేరియంట్లకి చికిత్స చేయడంలో ఇది మరింత ప్రభావవంతంగా పనిచేయగలదు” అని డాక్టర్ ప్యాట్రిసియా కావజ్జోనీ (ఎఫ్‌డిఎకు చెందిన డ్రగ్ సెంటర్ డైరెక్టర్) అభిప్రాయపడ్డారు. ఇదిలావుండగా ఎలి లిల్లీ కాంట్రాక్ట్ కింద అమెరికా ప్రభుత్వానికి ఫిబ్రవరిలో 3 లక్షలు డోసులు, మరో 3లక్షల డోసులు మార్చిలో అందనున్నాయి.
- Advertisement -