Thursday, January 16, 2025

ఒహాయోలో భారతీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: భారతీయ అమెరికన్ విద్యార్థి శ్రేయాష్ రెడ్డి అమెరికాలోని ఓహాయెలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సిన్సివాటిలోని లిండ్నర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో బెణిగేరి శ్రేయాస్ రెడ్డి చదువుకుంటున్నాడు. ఆయన మృతదేహం స్థానికులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని భారత్ ఎంబసీకి సమాచారం ఇచ్చారు. మృతుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఇండియా నుంచి వస్తున్నారని భారత్ ఎంబిసీ వర్గాలు వెల్లడించాయి. ఎలా మృతి చెందాడు అనే విషయంపై ఇంకా పోలీసులు వెల్లడించలేదు. జార్జియా రాష్ట్రంలోని లిథోనియాలో ఇటీవలే వివేక్ సైనీ అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఇండియానాలో భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News