Monday, December 23, 2024

భారత వ్యతిరేక కథనంపై స్పందించిన అమెరికా

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: పాకిస్థాన్‌లో వరుస ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందని యూకెకు చెందిన ఓ మీడియా సంస్థ ఆరోపణలు చేస్తూ కథనం వెల్లడించింది. తాజాగా ఆ కథనంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇటువంటి ఆరోపణలను తీవ్రతరం చేసుకోకుండా ఇరు దేశాలూ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ..“ఆ మీడియా కథనం మా దృష్టికి వచ్చింది. ఆ ఆరోపణలపై మేం మాట్లాడడానికి, జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు. ఉద్రిక్తతలు నివారించేందుకు రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని సూచిస్తున్నాం” అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

బ్రిటన్‌కు చెందిన ది గార్డియన్ పత్రిక భారత్‌పై ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసింది. 2019లో పుల్వామా ఘటన తర్వాత నుంచి దేశానికి ప్రమాదకరంగా మారుతున్న వ్యక్తులను న్యూఢిల్లీ లక్షంగా చేసుకొందని పేర్కొంది. భారత విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ దాదాపు 20 హత్యలు చేయించి ఉంటుందని ఆరోపించింది. భారత్, పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారం గానే కథనం రాసినట్టు పేర్కొంది. దీనిపై ఇప్పటికే మన విదేశాంగ శాఖ స్పందించింది. అది పూర్తిగా తప్పుడు సమాచారమని , భారత వ్యతిరేక ప్రచారమని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News