Wednesday, December 25, 2024

భారతీయ విద్యార్థులకు అండగా అమెరికా

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: భారతీయులు లేదా భారత సంతతికి చెందిన 11 మంది విద్యార్థులు ఈ ఏడాది మరణించినట్లు వెలువడిన వార్తలు ఇక్కడి భారతీయులతోపాటు భారత్‌లో నివసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళనలు కలిగిస్తున్న నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విద్యార్థులకు ఆదరపూర్వకమైన వాతావరణాన్ని అమెరికా కల్పిస్తూనే ఉన్నట్లు ఒక ప్రముఖ భారతీయ-అమెరికన్ విద్యావేత్త తెలిపారు. విద్యార్థుల మరణాల వెనుక గల కారణాలు ఏమిటన్నది ఇంకా బయటపడనప్పటికీ ఇక్కడి భారతీయ దౌత్య కార్యాలయాలు మాత్రం భారతీయ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి.

విద్యార్థులతో తరచు సమావేశం కావడం, వారికి ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాల గురించి అవగాహనలక్పించడం వంటి చర్యలు చేపట్టాయి. ఇటువంటి ఘటనలు ఈ ఏడాది జరగడం దురదృష్టకరమని, విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన ఏర్పడడం కూడా సహజమేనని వర్జీనియాలోని జిర్జా మాసన్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డివిజన్ డీన్ గుర్దీప్ సింగ్ పేర్కొన్నారు. అయితే విద్వేషపూరిత నేరాలు హఠాత్తుగా పెరడానికి బలమైన కారణాలు ఏవీ తనకు కనిపించడం లేదని ఆయన అన్నారు. ఒకే యూనివర్సిటీలో మూడు, నాలుగు ఘటనలు జరిగి ఉంటే ఆందోళన కలిగేదని, కాని అటువంటిదేదీ లేదని, భారతీయ విద్యార్థులపై విద్వేషంతో నేరాలు చేయడానికి కారణాలు కూడా కనిపించడం లేదని ఆయన అన్నారు.

అయితే ఇటువంటి సంఘటన పట్ల భౠరతీయ విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందని ఆయన సూచించారు. యూనివర్సిటీలు ఉన్న ప్రదేశాలలోని పరిస్థితులను కూడా చూడాల్సి ఉంటుందని, ఇతర ప్రదేశాలతో పోలిస్తే ఆ ప్రాంతాలలో నేరాలు సంఖ్య కూడా ఎక్కువగా ఉండవచ్చని ఆయన చెప్పారు. పట్టణ ప్రాంతాలలో ఉన్న మెజారిటీ యూనివర్సిటీలు సురక్షితమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్‌కు చెందిన ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం అమెరికాలో చదువుకునే భారతీయుల సంఖ్య 2014-15లో 1,32,888 ఉండగా 2024 సంవత్సరానికి అది 3,53,803కి అంటే దాదదాపు మూడు రెట్టు పెరిగింది.

భారతీయ విద్యార్థుల మనోధైర్యాన్ని నింపేందుకు పెద్ద సంఖ్యలో భారతీయ సంతతిక చెందిన ప్రొఫెసర్లను వివిధ యూనివర్సిటీ క్యాంపస్‌లకు పంపే విధంగా ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు భారతీయ ఎంబసీ చర్యలు తీసుకుంటోంది. ఎటువంటి అత్యవసర పరిస్థితిలోనైనా తక్షణమే స్పందించే విధంగా స్వచ్ఛంద సేవ ప్రాతిపదిక ఈ నెట్‌వర్క్ ఉంటుదని సింగ్ తెలిపారు. గడచిన సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోవడం వల్ల కూడా విద్యార్థులలో కలవరం ఏర్పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఏదేమైనా అమెరికాలో అవకాశాలు అధికమని, ఈ దేశం అందరినీ అదరిస్తుందని సింగ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News