Sunday, December 29, 2024

ఇజ్రాయెల్‌కు అమెరికా భారీ షాక్… కీలక ఆయుధ సరఫరా నిలిపివేత

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా మాటలను పెడచెవిన పెట్టి గాజాలోకి చొచ్చుకెళ్తున్న ఇజ్రాయెల్ కు ఓ షాక్ ఎదురైంది. వాషింగ్టన్ నుంచి అందాల్సిన కేలక ఆయుధాల షిప్‌మెంట్‌ను నిలిపివేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కోటి 900 కిలోల బరువు ఉండే 1800 బాంబులు, 226 కిలోల బరువు ఉండే మరో 1700 బాంబులు ఇప్పుడు టెల్‌అవీవ్‌కు అందవు. ఈ విషయాన్ని బైడెన్ కార్యవర్గం లోని కీలక అధికారి ధ్రువీకరించారు. రఫాలో పౌరుల భద్రత, వారికి మానవీయ సాయంపై అమెరికా ఆందోళనలు పట్టించుకోని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం రఫాలో దాదాపు 10 లక్షల మందికి పైగా తలదాచుకొంటున్నారు. ఈ నేపథ్యంలో రఫాలో భారీ ఆపరేషన్లు చేపట్టకూడదని, ఆ ప్రాంతం లోకి మానవీయ సాయం పంపించేందుకు మార్గాలను అన్వేషించడానికి వీలుగా చర్చలు జరుపుతున్నాం. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రఫాలో వాడుతుందని అనుమానిస్తున్న ఆయుధాల ఎగుమతిని పునః సమీక్షిస్తున్నాం అని అమెరికా వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాలపై ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రఫాపై సోమవారం ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న వేళ, కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఇది తమ కీలక డిమాండ్లకు అనుగుణంగా లేదంటూ బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News