న్యూయార్క్: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తెలుగువారు దుర్మరణం చెందారు. ఉత్తర టెక్సాస్‌లోని జాన్సన్ కౌంటీ వద్ద రెండు కార్లు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. మృతులు ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం వాసులు ఐదుగురు ఉన్నట్టు గుర్తించారు. మృతుల్లో ముమ్మడివరం ఎంఎల్‌ఎ పొన్నాడ సతీష్ బంధువులు ఉన్నారు. సతీష్ బాబాయ్ నాగేశ్వర రావు కుటుంబ సభ్యులు నాగేశ్వర రావు – సీతామహాలక్ష్మీ దంపతులు, కుమార్తె నవీన్ గంగ, మనవడు, మనవరాలు మృతి చెందారు. నాగేశ్వర రావు అల్లుడు, ఆయన కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. మరో కారులో అమెరికాకు చెందిన డ్రైవర్ మృతి చెందినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాగేశ్వరరావు కుటుంబం టెక్సాస్ నుంచి రోడ్డు మార్గం ద్వారా డల్లాస్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఉంటున్న కూతురి ఇంటికి ఇటీవల వెళ్లినట్లు తెలుస్తోంది.