సిన్సినాటి: ఫుట్‌బాల్ ప్రపంచకప్ అర్హత పోటీల్లో భాగంగా మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా ఘన విజయం సాధించింది. సిన్సినాటిలోని ఓహిలో జరిగిన పోరులో అమెరికా 20 తేడాతో చిరకాల ప్రత్యర్థి మెక్సికోను చిత్తు చేసింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్లు ఎటాకింగ్ గేమ్‌ను ఆడాయి. అయితే ఆరంభంలో ఎంత ప్రయత్నించినా ఇరు జట్లకు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఇటు అమెరికా అటు మెక్సికో ఆటగాళ్లు రక్షణాత్మక ఆటకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఇక ద్వితీయార్ధంలో కూడా చాలా సేపటి వరకు గోల్స్ చేయడంలో ఇరు జట్లు విఫలమయ్యాయి. కానీ మరికొద్ది సేపట్లో మ్యాచ్ ముగుస్తుందనగా అమెరికా వెంటవెంటనే రెండు గోల్స్ సాధించింది. అప్పటి వరకు డ్రా దిశగా సాగిన మ్యాచ్ ఒక్కసారిగా ఫలితం దిశగా అడుగులు వేసింది. 74వ నిమిషంలో క్రిస్టియాన్ అమెరికాకు మొదటి గోల్‌ను అందించాడు. ఇక 85వ నిమిషంలో వెస్టన్ మెక్‌కెని రెండో గోల్‌ను నమోదు చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అమెరికా 20 తేడాతో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుని ప్రపంచకప్ బెర్త్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది. ఉత్తర అమెరికా క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా ఈ మ్యాచ్‌ను నిర్వహించారు. ప్రస్తుతం అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.