Monday, December 23, 2024

పాక్‌పై గెలిచిన అమెరికా…. షాక్ లో పాక్ అభిమానులు

- Advertisement -
- Advertisement -

డల్లాస్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌పై అమెరికా గెలిచి సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో అమెరికా సూపర్ ఓవర్ లో గెలిచి పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి అమెరికా ముందు 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ (50), అండ్రీస్ గౌస్(35), అరోన్ జోస్(36) పరుగులు చేయడంతో 159 పరుగులు చేశారు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. సూపర్ ఓవర్‌లో అమెరికా జట్టు 18 పరుగులు చేసింది. కానీ పాకిస్తాన్ జట్టు సూపర్ ఓవర్‌లో 13 పరుగులు చేయడంతో ఐదు పరుగులు తేడాతో యుఎస్‌ఎ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యుఎస్‌ఎ బౌలర్ కెంజిగే మూడు వికెట్లు, సౌరబ్ నేత్రావల్కర్ రెండు వికెట్లు తీసి పాకిస్థాన్ జట్టు నడ్డి విరిచారు. హాఫ్ సెంచరీ చేసిన మోనాంక్ పటేల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. పాకిస్థాన్ జట్టు ఓటమి పాలు కావడంతో ఆ దేశపు క్రికెట్ అభిమానులు షాక్ లో ఉన్నారు. అమెరికాలాంటి చిన్ని జట్టు పాకిస్థాన్ ఓడించటం ఏంటని సోషల్ మీడియాలో పాక్ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News