Wednesday, February 5, 2025

చైనా, హాంకాంగ్ పార్శిళ్లకు అమెరికా బంద్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10 శాతం సుంకం విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా, హాంకాంగ్‌ల నుంచి వచ్చే పార్శిళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమెరికా పోస్టల్ సర్వీస్ ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి ఇది అమలు లోకి వస్తుందని పేర్కొంది. ‘ డి మినిమిస్ కింద అమెరికాకు రవాణా అవుతున్న పార్శిళ్లలో దాదాపు సగం చైనా నుంచి వస్తున్నవేనని యూఎస్ కాంగ్రెస్ కమిటీ గతంలోనూ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News