వాషింగ్టన్: అమెరికాకు చెందిన వెల్స్ ఫార్గో అండ్ కంపెనీ అనే బ్యాంకింగ్ సంస్థ డజన్ల కొద్దీ ఉద్యోగులను తొలగించింది. ఎందరకయ్యా అంటే వారంతా పనిచేయకుండా పనిచేస్తున్నట్లు నటిస్తున్నారట. ఈ విషయానిన బ్లూమ్ బర్గ్ రిపోర్టు చేసింది.
ఆ కంపెనీ గత నెల చాలా మంది ఉద్యోగులను తొలగించింది. వారు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నప్పుడు కీబోర్డు సిమ్యూలేషన్ కు పాల్పడ్డారని ఆరోపణ.
విషయంలోకి వస్తే…కంప్యూటర్ ను ఎక్కువసేపు యాక్టివ్ గా ఉంచకపోతే అది స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. దానిని నియంత్రించే పరికరం ‘మౌస్ జింగింగ్’. ఇది మానవ ప్రమేయం లేకుండానే మౌస్ కర్సర్ ని యాక్టివ్ గా ఉంచుతుంది. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నప్పుడు బయటికి వెళ్లాల్సి వస్తే వారు కంప్యూటర్ ను యాక్టివేట్ గా ఉంచేందుకు ఈ మౌస్ జింగింగ్ ను ఉపయోగిస్తుంటారు. ఈ పరికరం నిరంతరం మౌస్ ను కదిలిస్తుంటుంది. దాంతో కంపెనీ… ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారనే భ్రమలో ఉండే అవకాశం ఉంది.