Thursday, December 26, 2024

అమెరికన్ కాన్సలేట్ జనరల్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సలేట్ జనరల్ తమ కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తమ హైదరాబాద్ కార్యాలయంలో వీసా అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థుల నుంచి అమెరికన్ కాన్సలేట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అమెరికన్ కాన్సలేట్ తన అధికారిక వెబ్‌సూట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఉ ద్యోగం శాశ్వత, పూర్తిస్థాయి ప్రాతిపదికన నియామకం జరుగుతుంది. ఉద్యోగులు వారానికి 40 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి అభ్యర్థుల విద్యార్హత రెండేళ్ల కాలేజ్ లేదా యూనివర్సిటీ విద్యలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. విద్యతోపాటు ప్రజా సవబంధాలు, కస్టమర్ సర్వీస్‌తోకూడిన అడ్మినిస్ట్రేటవ్ వర్క్‌లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

ఆతిథ్యం దేశంపై అవగాహన, ఆ దేశ సాంప్రదాయాలు, వివాహం, జననం, దత్తత, ఇమిగ్రేషన్ వంటి అశాలకు సంబంధించిన చట్టాలు తెలిసి ఉండాలి. వీసా దరఖాస్తులలో పొందుపరిచిన సమాచారాన్ని గ్రహించడంపాటు జాతీయ, ప్రొవిజనల్ విద్యా విధానాల గురించి తలిసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ. 7.35,015 వార్షిక వేతనం ఉంటుంది. శనివారం, ఆదివారం సెలువు రోజులు ఉంటాయి. అభ్యర్థులు తమ దరఖాస్తులను హైదరాబాద్‌లోని అమెఇకన్ కాన్సలేట్ జనరల్ అధికారిక వెబ్‌సైట్‌కు 2023 జనవరి 23వ తేదీలోపు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ,ఏసేందుకు ఈ సైట్‌లో లాగిన్ అవ్వండి:

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News