Monday, December 23, 2024

బాలికను దత్తత తీసుకున్న అమెరికా దంపతులు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం  : మన దేశం కాదు.. మన రాష్ట్రం కా దు.. మన ఊరు కాదు . ఎక్కడో.. తల్లి కేరళ, తండ్రి ఆస్ట్రేలియా.. ఇద్దరు యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికాలో స్థిరపడ్డారు. ఈ దంపతులు భారత దే శం నుండి అ నాధ బాలికని దత్తత తీ సుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్నెట్లో భారత దేశం పిల్లల ద త్తత గురించి తెలుసుకొని, అక్కడి వ ర్గాల సూచన మేరకు భారత దేశం పి ల్లల దత్తత గురించి ఆరా తీశారు. కేం ద్ర శిశు, మ హిళా సంక్షేమశాఖ ద్వా రా అధికారికంగా వెబ్ సైట్ లో బా లిక దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తో వీడియో కాల్ నందు మాట్లాడి వివరాలు తెలుసుకొని వారి ధ్రువపత్రాలు పరిశీలించి,

వారు సమర్పించిన పత్రాలన్నీ ప క్కాగా ఉన్నాయని నిర్ధారించి, దత్తతకు అంగీకరించారు. ఈ మేరకు గురువారం నూ తన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో విదేశీ దంపతులకు బాలిక ను ఫ్లో రైన్ హస్కి,గీనా క్యూరియకోస్ అత్తాపి ల్లే అనే దంపతులకు అప్పగించారు. ఇటివల ఒక బాబును కూడా ఇటలికి చెందిన దంపతులకు దత్తత ఇచ్చిన వి షయం తెలిసిందే.ఈ సందర్భంగా క లెక్టర్ మాట్లాడు తూ, పిల్లల దత్తత కావాల్సిన వారు డబ్ల్యు డబ్ల్యుడబ్యు. సిఏఆర్‌ఏ.నిక్.ఇన్ అనే వైబ్ సైట్ నుండి చట్టబద్దంగా స్త్రీ- శిశు సంక్షేమ శాఖ ద్వారా అధికారికంగా దత్తత కో సం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జిల్లా సంక్షేమ అధికారిణి సుమ, డిసిపిఓ విష్ణు వందన, పిఓఐసి సోనీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News