Friday, November 22, 2024

ఇంటర్మీడియట్‌తో ఆగిపోవద్దు

- Advertisement -
- Advertisement -

‘Earning a college degree is such an important step in life that it has become a central part of the ‘American Dream’. Go to college, get a job, buy a house, raise a family. It may not always be that simple, but it all starts with your college education’ Becton Loveless. కొన్ని వాక్యాలు అందంగా, ఆకర్షణీయంగా, అలంకారికంగా ఉండకపోవచ్చు. కానీ, అవే వాక్యాలు ఆలోచనాత్మకంగా ఉన్నప్పుడు అవి అలంకృత వాక్యాల కంటే ఎంతో మహత్పూర్వకమైనవి. ఈ తరహా వాక్యాల్లో ‘ఉంది అనిపించడం కంటే, ఉండాలి ( To be, rather than to seem)’ అనే తాత్త్విక వాక్యం ఒకటి. ఇది నాకు సాదా సీదా చోట దొరికిన వాక్యం కాదు. ప్రపంచంలోని చరిత్రాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా భాసిల్లుతున్న అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ‘విలియం పీస్ విశ్వవిద్యాలయం’ శిఖావుంగరంలోని మంగళ వాక్యం. మంగళ వాక్యాన్నే ఆశయ (Motto) వాక్యం, బిరుద వాక్యం అంటారు.

ఇప్పుడు ఈ మంగళ వాక్యం ప్రస్తావన ఎందుకు అంటే, కొంత మంది హావభావాలు, మాట తీరు, వేష భాషలు, పని, ప్రవర్తన చూసినప్పుడు వాళ్లు బాగా ఉన్నత చదువులు చదివిన వాళ్లలా అనిపిస్తారు. తీరా వాళ్ల విద్యార్హతలను తెప్పించుకుని చూస్తే పాఠశాల స్థాయిలోనే చదువు ఆగిన వాళ్లై ఉంటున్నారు. వాళ్లే కనుక నిజంగా డిగ్రీ, పి.జి చదివి ఉంటే వ్యవహారంలో, వృత్తి ఉద్యోగంలో ఇంకెంతగా రాణించే వాళ్లో, కుటుంబాలకు, సమాజానికి ఇంకెంత మేలు జరిగి ఉండేదో అవలోకనం కాగలదు. ఇంతకూ నేను చెప్పొచ్చేదేమంటే ఇప్పుడు ఇంటర్మీడియేట్ పాసైన విద్యార్థినీ, విద్యార్థులందరూ డిగ్రీ తప్పని సరిగా చదవాలని కోరుతున్నాను.
ప్రపంచం వేగవంతంగా మారుతోంది. సాంకేతికత మన వేగవంతమైన కలలకు మించి అభివృద్ధి చెందుతోంది. వృత్తులు, వ్యాపా రం, పర్యావరణం, రాజకీయాలు సంక్లిష్టంగా మారిపోతున్నా యి. సమాజాన్ని ఎన్నో సమస్యలు సవాలు చేస్తున్నాయి. ఈ సవాళ్ల మధ్య ధైర్యంగా నిలబడి దృఢ సంకల్పంతో ఎదుర్కొనేందుకు ఉన్నత విద్య విద్యార్థులను సంసిద్ధం చేస్తుంది.

డిగ్రీ విద్య తరగతి గది బోధన మాత్రమే కాకుండా, అంతకు మించిన శక్తికలిగినది. వ్యక్తిత్వం (Individuality), పట్టుదల (Perse verance), నైపుణ్యం(Skill) అనే మూడు కోణాల్లో అన్వేషణకు సంబంధించిన సమగ్రత డిగ్రీతో సమకూరగలదు. జ్ఞాన పరిధిలోని ఆలోచించడం (Thinking), తయారు చేయడం (Creating), బట్వాడా చేయడం (Transfer) గురించిన సంపూర్ణ అభ్యసనం డిగ్రీ కోర్సుల ద్వారా అలవడుతుంది. వ్యక్తి వాస్తవిక ఎదుగుదలకు, పరివర్తనకు కూడా డిగ్రీ కోర్సు అద్దం పట్టగలదు. విద్య సంభావ్యత (Potential) నుండి సాక్షాత్కారం (Realisation)దాకా డిగ్రీ విద్య విద్యార్థుల్లో స్థాయీ పోషణ జరుపగలదు. డిగ్రీ లేకున్నా బాగానే బతుకుతున్నాను, తగిన వ్యవహార దక్షత ఉంది అని తృప్తిపడే కంటే, ప్రతి యువతీ, యువకుడు డిగ్రీ పట్టా కలిగి ఉండాలి అనేది నా భావన. అందుగురించే ‘To be, rather than to seem’ వాక్యాన్ని వ్యాసం మొదట్లో ప్రస్తావించాను.

ఆర్థిక ప్రాతిపదికన సంపన్నులు, మధ్యతరగతి, పేదలు అనే మూడు వర్గాలుగా ఉన్న మన ప్రజానీకంలో డ్రాప్ ఔట్ అత్యధిక శాతం పేద, మధ్యతరగతి నుండే తలెత్తుతుంది. స్వల్పాదాయం తో నిత్యం సతమతమవుతూ ఉండే పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు ఇంటర్మీడియేట్‌తోనే తమ పిల్లల చదువును ఆపుతున్నారు. అసంఘటిత రంగంలో, స్వల్పాదాయ ఉపాధిలో డ్రాప్ ఔట్ యువత చేరిపోతున్నారు. నివాస రీత్యా అర్బన్, రూరల్, ట్రైబల్ ప్రాంతాల్లో ఉండే జనాభాలో గ్రామీణ, ఆదివాసీల్లో డ్రాప్ ఔట్ అత్యధికంగా ఉంటుంది. ఉన్నత విద్య అందుబాటులో లేకపోవడం ఒక కారణమైతే, ఉన్నత విద్య పట్ల సరియైన అవగాహన లేకపోవడం వీళ్ల డ్రాప్ ఔట్‌కు బలీయమైన కారణం.

యువత సుస్థిర భవిష్యత్తు కోసం విద్యను మార్చడం అవసరం అంటూనే, సమాజ పునర్నిర్మాణం (Reimaging Reshaping, Rebuilding) ఉన్నత విద్య ద్వారానే సాధ్యపడుతుందని యునె స్కో సైతం తన వంతుగా ప్రపంచ దేశాలకు సహకారం అందిస్తున్నది. World Conference on Higher Education Higher Education in the Twenty -First Century: Vision and Action on 9 October 1998 నాటి డిక్లరేషన్ ఉపోద్ఘాతం చెబుతున్నట్టు ‘On the eve of a new century, there is an unprecedented demand for and a great diversification in higher education, as well as an increased awareness of its vital importance for sociocultural and economic development, and for building the future, for which the younger generations will need to be equipped with new skills, know ledge and ideals. Higher education inclu des ‘all types of studies, training or training for research at the post- secondary level, provided by universities or other educational establishments that are approved as institutions of higher education by the com petent State authorities’ అంటూ సామాజిక, సాంస్కృతిక ఉన్నతీకరణకు ఆర్థికాభివృద్ధి కొరకు ఉన్నత విద్య ప్రతి ఇంటి తలుపు తట్టాలని యునెస్కో పాతికేండ్లుగా పరితపిస్తోంది.

అయినప్పటికీ మన దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నత విద్య పట్ల పేద మధ్యతరగతి ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రమేనని చెప్పాలి. ఈ నేపథ్యంలో కారణాలేవైనా ఉన్నత విద్యకు దూరమవుతున్న వర్గాలు కళాశాలల్లో చేరి ఉన్నత విద్య ద్వారా సమకూరే ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలనేది నా అభిమతం. విద్యార్థి జీవితంలో ఉన్నత విద్య చివరి దశ. డిప్లొమా సాధించడానికి సెకండరీ లేదా ఆపై రెండు తరగతులు (+2) ఉపయోగపడితే, ఉన్నత విద్య పట్టభద్రతను కల్పిస్తుంది. గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో పేరు చివర్న డిగ్రీ గొప్ప అనిపించకపోవచ్చు కొంత మందికి. కష్టపడి మంచి కాలేజీ నుండి డిగ్రీ పొందితే ఇప్పటికీ తగిన గౌరవమే ఉంది. కాలేజీ ప్రాంగణ ఎంపిక పొందిన వాళ్లకు సముచిత గౌరవంతో పాటు మంచి జీతభత్యాలు ఉన్న మాటను ఎవరూ విస్మరించరాదు. పాఠశాలానంతరం విద్య కొనసాగించడం ఇవాళ ఒక సామాజిక అవసరం. కొన్ని ముఖ్యమైన వృత్తుల అవలంబనకు, ఉద్యోగాల నియామకాలకు, పదవుల నిర్వహణకు నిరంతర విద్య లేదా విద్య కొనసాగింపే కీలకమైంది.

Education corner.com
Access control | Corner Access control. Helping you to realise your dreams since 1952: our driver is your success. Find out how we can help you. corner.com సహ నిర్వాహకులు Bencton Loveles ఏమంటాడంటే, పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆశీస్సుల్లో ఉత్తమ విద్య, ఉన్నత విద్య అనేవే అతి విలువైనవి అని. విజయం, శ్రేయస్సు కేంద్రంగా ఆలోచించే అమెరికా పౌర దృక్పథం ‘American Dream’ కళాశాలలో చేరి డిగ్రీ సంపాదించడంతోనే ప్రారంభమవుతుందని, అదే ఆ దేశపు అభివృద్ధికి మూల సూత్రమని మనం గమనించాలి. అందుకే మన రాష్ట్రంలోని ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి డిగ్రీలో తప్పక చేర్పించేందుకు తల్లిదండ్రులు పూనుకోవాలి. ఇంత చెపుతున్నా లక్ష్య పెట్టకుండా, వీలున్నమటుకు చదుకున్నం, చదివించినం డిగ్రీతో పనేముంది, డిగ్రీతో లేకుంటే నష్టమేముంది అని విద్యార్థులూ, తల్లిదండ్రులూ వాదనకు దిగొచ్చు.

నిరుద్యోగులుగా రోడ్లకెక్కడం తప్ప డిగ్రీ చదవడం వల్ల లాభమేమిటన్న వాళ్లకు ఇదిగో ఇదే మేధావులు చెబుతున్న సమాధానం. తల్లిదండ్రులారా! పిల్లలు డిగ్రీలో చేర్పించడమనేది మీ కుటుంబ భవిష్యత్తుకు మీరు పెడుతున్న పెట్టుబడి అని గ్రహించండి.
ఏ డబ్బైతే మీకు అత్యవసరం అనుకుంటున్నారో అట్టి డబ్బు డిగ్రీ అనంతరం మంచి ఉపాధితో సంపాదించవచ్చు. విద్యార్థులూ! డిగ్రీ వలన మీకు, మీ కుటుంబానికి సాంఘిక హోదాతో పాటు అనేక ప్రయోజనాలుంటాయి. వీటిల్లో మెరుగైన కెరీర్ అవకాశాలుంటాయి. నెట్ వర్కింగ్, సృజన సంబంధాలు విస్తరిస్తాయి.

వ్యక్తిత్వం ప్రస్ఫుటం అవుతుంది. యాజమాన్యాలు అత్యధికులు మీ సేవలను కోరుకుంటారు, నాణ్యమైన, మెరుగైన అవకాశాలు ఎల్లప్పుడూ మీ ముంగిట్లో ఉంటాయి. ఉద్యోగ భద్రతో పాటు సంతృప్తి కూడా మీ సొంతమవుతుంది. పి.జి కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం లభిస్తుంది. ప్రత్యేకాధ్యయనాలకు, పరిశోధనకు అవకాశమూ లభిస్తుంది. విదేశాలకూ మీ సేవలు, ప్రాజెక్టులూ అవసరమవుతాయి. నైపుణ్యాభివృద్ధి వర్థిల్లిమీరు ఎంచుకున్న రంగా ల్లో ప్రభావ పూరిత వ్యక్తులుగా మీరు మరింతగా రాణిస్తారు. చేతిలో ఒక్క డిగ్రీ ఉంటే వంద అవకాశాలు మీ తలుపు తడుతాయి. ఇంటర్‌తో చదువాపకండి. డిగ్రీలో చేరండి, పట్టుదలతో పట్టా అందుకోండి. క్వాలిఫికేషన్‌తోనే క్వాలిటీ ఆఫ్ లైఫ్ సాధ్యం. నమ్మండి. ఇందుకు మన రాష్ట్రంలో Degree Online Services, Telangana (DOST) ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది, దరఖాస్తు చేసుకోండి.

డా. బెల్లియాదయ్య
9848392690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News