Thursday, December 26, 2024

గుజరాతీ యువకుడి మానవత్వం….. అమెరికా అమ్మాయి సలాం(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: మానవతా దృక్పథంతో చేసే చర్యలకు స్పందించని హృదమాంటూ ఉవీ ఉండవు. గుజరాత్‌లో ట్రైనులో పర్సు పోగొట్టుకున్న ఒక అమెరికన్ మహిళకు ఎదురైన అనుభవం నెటిజన్ల మనసును దోచుకుంది. ఇందుకు సంబంధించి ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోకు నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. ఇటీవల గుజరాత్‌ను సందర్శించిన అమెరికన్ మహిళ స్టెఫ్ రైలులో ప్రయాణిస్తుండగా తన పర్సును మరచిపోయి దిగాల్సిన స్టేషన్‌లో దిగిపోయింది. ఆ పర్సులో అత్యంత విలువైన పత్రాలతోపాటు కొంత డబ్బు కూడా ఉంది.

అయితే ఆ పర్సు చిరాగ్ అనే యువకుడికి దొరికింది. ఆమె ఫోన్ నంబర్ ఆ పర్సులో లభించడంతో చిరాగ్ ఆమెకు ఫోన్ చేసి పర్సును కలెక్ట్ చేసుకోవలసిందిగా కోరాడు. పర్సును తీసుకోవడానికి భుజ్ పట్టణంలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లిన స్టెఫ్ చిరాగ్ అంటూ గట్టిగా పిలిచింది. ఆమె వద్దకు వచ్చి చిరాగ్ తనను తాను పరిచయం చేసుకుని పర్సును ఆమెకు అందచేశాడు. కృతజ్ఞతగా ఆమె కొంత నగదు ఇవ్వబోతే అతను నిర్దంద్వంగా తిరస్కరించాడు.

ఈ దృశ్యాన్నంతా వీడియో తీసిన స్టెఫ్ భారతదేశ ఔన్నత్యాన్ని కీర్తిస్తూ ట్వీట్ చేశారు. తనకు మేలు చేసిన మంచిమనిషికి బహుమతి ఇద్దామనుకుని తాను ఎంత తప్పు చేశానో 3,000 సార్లకు పైగా గ్రహించానని, ఇటువంటి సంస్కృతిని అమెరికాలో తాను చూడలేనని, ఇండియా గొప్పదనం ఇదేనంటూ స్టెఫ్ ట్వీట్ చేశారు. స్టెఫ్ పోస్ట్ చేసిన వీడియోకు, ఆమె కామెంట్‌కు నెటిజన్ల నుంచి అభినందనలతో కూడిన ప్రతిస్పందన లభించింది. చిరాగ్ నిజాయితీకి భారీ స్థాయిలో ప్రశంసలు లభించాయి. ప్రపంచంలోని మనుషులందరినీ భారతదేశం హృదయపూర్వకంగా స్వాగతించడంతోపాటు గౌరవిస్తుందని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News