Friday, January 10, 2025

అరుదైన క్యాన్సర్ కు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ చికిత్స

- Advertisement -
- Advertisement -

ఏకకాలంలో కంటికి సంబంధించిన నరాల వ్యాధి ( ఆక్యులర్ మయస్తీనియా గ్రావిస్ (OMG)) తో పాటుగా కంటి సంబంధిత క్యాన్సర్ ( యాంటీరియర్ మెడియాస్టినల్ థైమోమా) తో బాధ పడుతున్న 45 ఏళ్ల రోగికి విజయవంతంగా అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్, గుంటూరు చికిత్స అందించింది. ఆక్యులర్ మయస్తీనియా గ్రావిస్ (OMG) అనేది అత్యంత అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది కళ్ళు మరియు కనురెప్పలను కదిలించే కండరాలను ప్రభావితం చేస్తుంది. ఒకటికి బదులుగా రెండు గా చిత్రాలు కనబడటం, దృష్టి కేంద్రీకరించటం లో ఇబ్బంది మరియు కనురెప్పలు వాలిపోవడం వంటి లక్షణాలు ఆక్యులర్ మయస్తీనియా గ్రావిస్ (OMG) లో కనిపిస్తాయి. ఈ రోగికి బ్రెస్ట్ బోన్ వెనుక ఉన్న థైమస్ గ్రంధిలో ఒక కణితి ఉండటం వల్ల రోగి యొక్క పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

క్రాంతి తుమ్మ (పేరు మార్చబడింది) తన రెండు ఎగువ కనురెప్పలు పడిపోతున్నాయనే సమస్య తో హాస్పిటల్ కు వచ్చారు . రోగిని పరిశీలించటం తో పాటుగా తదుపరి పరీక్షలు చేసి తర్వాత సమస్య జఠిలమైనదని తెలుసుకోవటం జరిగింది. రోగి కుటుంబ సభ్యులతో సంప్రదించిన తరువాత శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు.

కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఫణీంద్ర కుమార్ నాగిశెట్టి నేతృత్వంలో కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ,డాక్టర్ చందన వేమూరి, అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ సాయిబాబు బృందం ఆ రోగికి చికిత్స చేసింది. రైట్- సైడెడ్ VATS థైమెక్టమీ పద్దతిలో చేసిన ఈ చికిత్స విజయవంతం అయిందని డాక్టర్ ఫణీంద్ర కుమార్ తెలిపారు. సాంప్రదాయ స్టెర్నోటమీ వలె కాకుండా ఈ విధానం తో చేసిన శస్త్రచికిత్స కారణంగా శస్త్రచికిత్స అనంతర నొప్పి తక్కువగా ఉంటుందన్నారు , తక్కువ సమయం లో రోగి వేగంగా కోలుకున్నాడన్నారు. ఆయనే మాట్లాడుతూ, “ఒకే సమయంలో ఆక్యులర్ మయస్తీనియా గ్రావిస్ మరియు యాంటీరియర్ మెడియాస్టినల్ థైమోమా కారణంగా ఈ కేసు ప్రత్యేకమైన సవాల్ గా నిలిచిందన్నారు. థొరాకోస్కోపికల్‌గా రైట్ సైడెడ్ వాట్స్ థైమెక్టమీని నిర్వహించడం ద్వారా, థైమస్ గ్రంధి , కణితిని తొలగించామన్నారు,

రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ, “ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం తో పాటుగా బహుళ నైపుణ్యాలు కలిగిన బృందం కారణంగా అత్యంత సవాలుతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్న కేసులలో సైతం ఉత్తమమైన ఫలితాలను సాధిస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News