- Advertisement -
ఫిలడెల్ఫియా: అమెరికన్లు ఇప్పటికీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను నమ్మడం లేదు. 80 మిలియన్ల అమెరికన్లు 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను ఎన్నుకోలేదు. అమెరికన్లు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కే మొగ్గుచూపుతున్నారని పెన్సిల్వేనియాలో ప్రచారం చేస్తున్న డెమోక్రటిక్ నాయకుడు నీల్ మఖీజా తెలిపారు. ఆయన హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకున్నారు. అమెరికన్లు తొలిసారి ఓ మహిళను అధ్యక్షురాలిగా ఎన్నుకుని చరిత్ర లిఖించబోతున్నారని ఆయన అన్నారు. కమలా హారిస్ అమెరికాకు ఓ ఆశాకిరణం అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. కమలా తప్పక అమెరికా అధ్యక్షురాలవుతుందని అన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరుగనున్నాయి. కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎన్నికల పోటీ తీవ్రంగా ఉంది. అయితే మిచిగాన్, విస్కన్సిన్ లో కమలా హారిస్ కు కాస్త అనుకూలత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
- Advertisement -