న్యూయార్క్: అమెరికాలోని చికాగోలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి చేశారు. లంగర్‌హౌజ్‌కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీ కాంప్‌బెల్‌లో నివాసం ఉంటున్నాడు. అలీ ఇండియానా వెస్లయన్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదివేందుకు అమెరికాకు వెళ్లాడు. హోటల్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో అతడిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. తల, ముక్కు, కళ్లపై తీవ్ర గాయాలు కావడంతో రక్తంతో తడిసిముద్దగా మారాడు. తనపై జరిగిన దాడిని వీడియో ద్వారా వెల్లడించాడు. సిసి కెమెరాలో ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. అలీకి భార్య ముగ్గురు పిల్లలు హైదరాబాద్ లో ఉన్నారు. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలీకి వైద్యం అందించాలని అమెరికాలో ఉన్న భారత్ ఎంబసీ అధికారులకు తెలిపారు.
🚨🚨 In #Chicago , a student hailing from Hyderabad was assaulted by four armed robbers near his residence, resulting in injuries. Video evidence captures the student, bleeding heavily, recounting being kicked, punched, and robbed of his phone by the assailants. pic.twitter.com/SKOBNKuWeh
— The Quotes (@TheQuotesLive) February 7, 2024