Monday, April 7, 2025

ట్రంప్‌కు వ్యతిరేకంగా అమెరికన్ల నిరసన

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ డిసిలో రోడ్లపైకి వేలాదిగా జనం
మొత్తం 50 రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అమెరికన్లు
ట్రంప్ నిర్ణయాలతో దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతాయని ఆందోళన

వాషింగ్టన్ : అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ట్రంప్, ఎలాన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు, దాదాపు 50 రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ట్రంప్ రెండవ సారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత జరిగిన అతిపెద్ద నిరసన కార్యక్రమం ఇదేనని అక్కడి రాజకీయ వర్గాలు తెలియజేశాయి. ముందు చూపు లేకుండా ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వాణిజ్య యుద్ధాలు జరుగుతాయని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ మస్క్ తీసుకున్న నిర్ణయంపైనా వారు నిరసన వ్యక్తం చేశారు. ‘హ్యాండ్స్ ఆఫ్!’ పేరుతో జనం దేశవ్యాప్తంగా 1200 పైచిలుకు ప్రదేశాల్లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘ట్రంప్ గో బ్యాక్’, ‘హ్యాండ్స్ ఆఫ్ డెమోక్రసీ’, ‘మస్క్ వాజ్ నాట్ ఎలెక్టెడ్’ వంటి నినాదాలతో వాషింగ్టన్ డిసి, న్యూయార్క్, షికాగో, మయామీ వంటి నగరాల్లో నిస్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ కార్యాలయాల వద్ద వారు ఆందోళనలు చేస్తున్నారు. అఢ్యక్షుడు ట్రంప్ అమలు చేస్తున్న వలస వ్యతిరేక విధానాలు, టారిఫ్‌లు విధింపు, మస్క్ చేతిలో ప్రభుత్వ డేటా గోప్యతపై ప్రజలు తమ ఆందోళనలను కేంద్రీకరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News