Wednesday, January 22, 2025

బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌కు చేదు అనుభవం

- Advertisement -
- Advertisement -

లండన్: స్కాట్‌ల్యాండ్‌లోని గ్లాస్గోలో శుక్రవారం బ్రిటన్‌లోని భారతీయ హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి ్రఒక గురుద్వారలోకి పవేశించకుండా కొందరు సిక్కులు అడ్డుపడ్డారు.

ఆల్బర్ట్ డ్రైవ్‌పై ఉన్న గ్లాస్గో గురుద్వారలోకి విక్రమ్ దొరస్వామి ప్రవేశించకుండా ఖలిస్తానీ మద్దతుదారుడిగా భావిస్తున్న ఒక సిక్కు వ్యక్తి అడ్డుకుంటున్న వీడియో సిక్ యూత్ యుకె అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో దర్శనమిచ్చింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య దరిమిలా భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం రాజకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

కెనడాతోపాటు ఇతర ప్రాంతాలలో సిక్కులపై వారు దాడులు జరుపుతున్నారని, గ్లాస్గోలో తాము చేసిన తరహాలోనే భారతీయ రాబారులను ప్రతి సిక్కు పౌరుడు అడ్డుకోవాలని ఆ వీడియోలో ఒక వ్యక్తి అనడం వినిపించింది.

తమ అధికారిక హోదాలో గురుద్వారలను సందర్శించే భారతీయ రాబారులు లేదా అధికారులపై బ్రిటన్‌లో నిషేధం ఉందని సిక్ యూత్ యుకె వెల్లడించింది. ప్రతి భారత రాయబారి లేదా భారత ప్రభుత్వ అధికారి నపట్ల ఇదే రకంగా వ్యవహరిస్తామని ఆ వీడియోలో ఒక వ్యక్తి చెప్పాడు. కెనడాలో ఏం జరుగుతోందో, భారత్ ఆడుతున్న ఆటలు ఏమిటో తమకు తెలుసునని, భారత ప్రభుత్వ తీరును కెనడా ప్రధాని బహిరంగంగా ఖండించడమేగాక భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించారని ఆ వ్యక్తి చెప్పడం వీడియోలో వినిపించింది.

కాగా, గ్లాస్గో గురుద్వార ఘటనపై భారత హైకమిషన్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News