Monday, December 23, 2024

భావోద్వేగానికి గురైన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో రైలు ప్రమాదం దేశం యావత్తును కలచివేసింది. అందులో 280కి పైగా మంది మరణించగా, 1000 మందికి పైగా గాయాలయ్యాయి. 30 ఏళ్ల తర్వాత ఇదే పెద్ద రైలు ప్రమాదం. బాలాసోర్‌లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిస్థితులను గమనించి చర్యలు తీసుకుంటున్నారు. మూడు రైళ్లు ప్రమాదానికి గురికావడంతో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యారు.

ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా లక్షం గల్లంతయిన వారి వివరాలు కనుగొని వారి కుటుంబానికి తెలుపడమే…మా బాధ్యత ఇంకా అయిపోలేదు’ అన్నారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయ. అందులో బెంగళూరు హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్‌చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్, ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి. దీనికి బాధ్యత వహిస్తూ అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్, శివసేన(యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ సహా అనేక మంది ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు.

‘ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టం’ సమస్య కారణంగా రైలు ప్రమాదం జరిగిందని వైష్ణవ్ నిన్న తెలిపారు. అయితే రైల్వే బోర్డ్ మాత్రం సిగ్నలింగ్‌లో కొన్ని సమస్యలు ఏర్పడ్డం వల్ల రైలు ప్రమాదం జరిగిందని పేర్కొంది. ‘ప్రాథమిక దర్యాప్తులో సిగ్నలింగ్ సమస్యల వల్ల ప్రమాదం జరిగిందని తెలిసింది. మేము ఇంకా రైల్వే సేఫ్టీ కమిషనర్ నుంచి సవివరమైన రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నాం. కేవలం కోరమండల్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే ప్రమాదానికి గురయింది. ఆ రైలు గంటకు 128 కిమీ. వేగంతో ప్రయాణించింది’ అన్నారు రైల్వే ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ (రైల్వే బోర్డ్) సభ్యుడు జయ వర్మ సిన్హా.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News