Sunday, December 22, 2024

లోక్‌సభ స్పీకర్ పదవిపై సస్పెన్స్

- Advertisement -
- Advertisement -

జనతాదళ్ (యు), తెలుగు దేశం పార్టీ (టిడిపి) బిజెపి నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)లో భాగమని, లోక్‌సభ స్పీకర్ పదవికి బిజెపి నామినేట్ చేసే అభ్యర్థికి మద్దతు ఇస్తామని జెడి (యు) నేత కెసి త్యాగి ప్రకటించారు. ‘జెడి (యు),టిడిపి ఎన్‌డిఎలో అంతర్భాగంగా ఉన్నాయి. (స్పీకర్ పదవికి) బిజెపి నామినేట్ చేసే వ్యక్తికి మేము మద్దతు ఇస్తాం’ అని త్యాగి ‘ఎఎన్‌ఐ’ వార్తా సంస్థతో చెప్పారు. లోక్‌సభ కొత్త స్పీకర్ టిడిపి లేదా జెడి (యు) నుంచి వస్తారని ప్రతిపక్షనేతలు కొందరు చేసిన వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు త్యాగి ఆ విధంగా సమాధానం ఇచ్చారు. కేంద్రంలో మిత్ర పక్షాలతో సంకీర్ణ ప్రభుత్వానికి బిజెపి సారథ్యం వహిస్తున్న విషయం విదితమే. స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని బిజెపి నిలపవచ్చునని, అభ్యర్థి మిత్ర పక్షాల నుంచి ఉండకపోవచ్చునని త్యాగి వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

18వ లోక్‌సభ తొలి సెషన్‌లో ఈ నెల 26న లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనున్నది. నీట్ యుజి ఫలితాలపై వివాదం గురించి అడిగినప్పుడు, ఆ విషయం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉందని త్యాగి సమాధానం ఇచ్చారు. ‘ఆ అంశంపై మేము ఏ వ్యాఖ్యా చేయం’ అని ఆయన చెప్పారు. కేంద్ర బడ్జెట్ సమయంలో ప్రజల డిమాండ్లపై చర్చ ఉంటుందని ఆయన తెలిపారు. ‘పార్లమెంట్‌లో సకారాత్మక చర్చలు ఉంటాయి. ఎన్నికైన ఎంపిలు తమ తమ నియోజకవర్గాల ఆకాంక్షలు, కోర్కెలు, సమస్యలపై ముందుకు సాగుతారు’ అని త్యాగి చెప్పారు. 18వ లోక్‌సభ తొలి సెషన్ ఈ నెల 24 నుంచి జరుగుతుంది. రాజ్యసభ సమావేశాలు 27న మొదలవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News