Thursday, January 23, 2025

నెక్ట్స్ లెవెల్‌లో కళ్యాణ్‌రామ్ నటన..(‘అమిగోస్’ ట్రైలర్)

- Advertisement -
- Advertisement -

హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ త్రిపాత్రిభినయంలో నటించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 10న గ్రాండ్ లెవెల్‌లో సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్‌ను కర్నూలులో చిత్ర యూనిట్ విడుదలచేసింది. ఈ కార్యక్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్, నిర్మాత యలమంచిలి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ.. “దర్శకుడు రాజేందర్ రెడ్డికి ఇది తొలి సినిమానే అయినప్పటికీ అత్యద్భుతంగా తెరకెక్కించాడు. కళ్యాణ్‌రామ్ నటన నెక్స్ లెవెల్‌లో ఉంటుంది. హీరోయిన్ ఆషికా రంగనాథ్ చక్కగా నటించింది” అని చెప్పా రు.

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మా ట్లాడుతూ.. “అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం. తాతగారు ‘రాముడు భీముడు’ సినిమా చేశాడు. తర్వాత బాబాయ్ చేశాడు. తర్వాత తమ్ముడు ‘జై లవకుశ’ చేశాడు. ఇవ న్నీ అన్నదమ్ముల మధ్య జరిగే కథలు. అయి తే మనుషులను పోలిన మనుషులు ఏడుగురుంటారని తెలుసు. అలాంటి ముగ్గురు మధ్య జరిగే కథ ‘అమిగోస్’. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తమ్ముడు ఎన్టీఆర్ అతిథిగా వస్తున్నాడు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News