Wednesday, January 22, 2025

న్యూస్‌క్లిక్‌లో మలుపు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్ వ్యాజ్యం కొత్త మలుపు తిరిగింది. ఈ సంస్థకు చెందిన మానవ వనరుల విభాగం అధినేత అమిత్ చక్రవర్తి అప్రూవల్‌గా మారేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ సాక్షిగా మారేందుకు తనకు అవకాశం , అనుమతి కల్పించాలని అమిత్ స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఆన్‌లైన్ సంస్థ అయిన న్యూస్‌క్లిక్ చైనా అనుకూల ప్రచారానికి దిగుతోందని, ఇందుకు బేరసారాలు కుదుర్చుకుందని ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) పరిధిలో ఈ సంస్థపై అభియోగాలు దాఖలు అయ్యాయి.

సంబంధిత కేసులో ఇప్పుడు అమిత్ ఇచ్చే సాక్షం కీలకం కానుంది. శనివారం ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు క్షమాభిక్ష పెట్టాలని, తాను అప్రూవర్‌గా మారుతానని ఆయన ప్రత్యేక న్యాయమూర్తి హర్దీప్ కౌర్‌కు అప్పీలు చేసుకున్నారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని పోలీసు దర్యాప్తు బృందానికి ఇవ్వడానికి తాను సిద్ధం అని కూడా ప్రకటించారు. ఈ కేసులో న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకులు ప్రబీర్ పుర్కయస్థతో పాటు అమిత్ చక్రవర్తిని కూడా స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News