Friday, December 27, 2024

బిఆర్‌ఎస్‌పై ‘అమితా’సక్తి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఛత్తీస్‌ఘఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ తనయుడు, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమిత్ జోగీ బుధవారం సిఎం కెసిఆర్‌తో ర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీ ముఖ్యనాయకులతో కలిసి బుధవారం ప్రగతి భవన్‌కు వచ్చిన అమిత్ జోగీ, సిఎంతో సుధీర్ఘంగా సమావేశం జరిపా రు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, దేశంలోని రాజకీయ పరిణామాలు, జాతీయ వ్యవహారాలపై లోతుగా చర్చించారు. బిఆర్‌ఎస్ జాతీయ పార్టీ విధి విధానాలను ఆసక్తితో అధినేత కెసిఆర్‌ను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తుల అవసరం ఉన్నదని అభిప్రాయ పడిన అమిత్ జోగి…. బిఆర్‌ఎస్ జాతీయ పార్టీని స్థాపించడాన్ని ఆహ్వానించారు.

అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్ర పాలనను దేశానికి ఆదర్శంగా నిలిపారని, సంక్షేమం అభివృద్ధి రంగాల్లో దేశంలో ముందు వరసలో తెలంగాణను నిలిపేందుకు కృషి చేసారని సిఎంను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు అమిత్ జోగీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన తండ్రి ఛత్తీస్ ఘఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ తన గురించి రాసుకున్న ఆటోబయోగ్రఫీని సిఎం కెసిఆర్‌కు బహూకరించారు. సిఎంను కలిసిన వారిలో జనతా కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు శాసనసభ్యులు కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News