Sunday, December 22, 2024

అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తాం : అమిత్‌ షా

- Advertisement -
- Advertisement -

అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఝార్ఖండ్ లోని పాలము ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా సంకీర్ణ ప్రభుత్వం దేశం లోనే అత్యంత అవినీతిమయ సర్కారుగా మారిందని, ఇకనైనా ప్రజలు వారిని గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చొరబాటులను అరికట్టడం కేవలం మోడీ నాయకత్వం లోని బీజేపీ వల్లనే సాధ్యమవు తుందన్నారు. ఓబీసీ కోటాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహారాష్ట్ర లోని కొన్ని వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, అయితే మత ప్రాదికన రిజర్వేషన్లనకు బీజేపీ వ్యతిరేకం అనే విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గుర్తుంచుకోవాలని అమిత్‌షా అన్నారు.

రాహుల్‌గాంధీ తన వెంట ఎప్పుడూ రాజ్యాంగాన్ని తీసుకెళ్లి , ప్రచారాల్లో దాన్ని చూపిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ , కాంగ్రెస్ నేత నకిలీ రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ దానిని అపహాస్యం చేస్తున్నారని అమిత్‌షా దుయ్యబట్టారు. జమ్ము కశ్మీర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమేనని, ఎన్ని తరాలు వచ్చి అడిగినా , ఆర్టికల్ 370 (ఆర్టికల్ 370)ని పునరుద్ధరించే అవకాశం లేదని షా పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పెరుగుతున్న అక్రమ చొరబాటుదారుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది తమ పొలిటికల్ అజెండా అని సిఎం హేమంత్ సోరెన్ విమర్శిస్తున్నారని అన్నారు. సోరెన్ వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News