Saturday, November 23, 2024

ఏం? మగాళ్లు మాట్లాడొద్దా?:అమిత్ షా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మహిళా బిల్లుపై మగ ఎంపిలు ముందుగా మాట్లాడితే తప్పని అంటారా? ఇదేం పద్థతి అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం కాంగ్రెస్‌పై విరుచుకు పడ్డారు. లోక్‌సభలో ప్రతిపక్షాల తరఫున మహిళా ఎంపిలు చర్చలో పాల్గొన్నారు. బిజెపి నుంచి ముందుగా మాట్లాడే అవకాశాన్ని బిజెపి ఎంపి నిశికాంత్ దూబెకు ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ పక్ష నాయకులు అధీర్ రంజన్ చౌదరి అభ్యంతరం తెలిపారు.

జరిగేది మహిళా బిల్లుపై చర్చ, ముందుగా బిజెపి మహిళా ఎంపిలకు ఛాన్స్ ఇవ్వాలన్నారు. తమ పార్టీ తరఫున సోనియా గాంధీ మాట్లాడారని చెప్పారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ చౌదరి వాదన విడ్డూరంగా ఉందని, మహిళ విషయాలపై కేవలం మహిళలే మాట్లాడాలా? ముందు మగవారు స్పందిస్తే తప్పేమిటి? అని ప్రశ్నించారు. బహుశా సోనియా గాంధీకి తొలి అవకాశం వచ్చిందని ఆయనకు అసూయగా ఉండి ఉంటుందని చమత్కరించారు. అయినా సోదరిల సమస్యలపై మనం మాట్లాడితే మంచిదే కదా అని కూడా షా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News