Monday, December 23, 2024

హైదరాబాద్‌కు ఒక్క రోజు ముందుగానే వస్తున్న అమిత్ షా!

- Advertisement -
- Advertisement -
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోడానికి బిజెపి సమాయత్తం అవుతోంది!

హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్చి 12న హైదరాబాద్ రావలసి ఉండింది, కానీ ఒక్క రోజు ముందుగానే అంటే మార్చి 11నే ఆయన హైదరాబాద్ రాబోతున్నారు. ఆయన హకీంపేట్‌లోని సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సిఐఎస్‌ఎఫ్) కార్యక్రమానికి హాజరవుతున్నారని సమాచారం. దాంతో పాటు ఆయన తెలంగాణలోని ప్రముఖ బిజెపి నాయకులతో చర్చలు జరుపనున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితి, పార్టీ కార్యక్రమాల సమీక్ష ఆయన జరుపనున్నారని తెలిసింది. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను గురించి కూడా ఆయన చర్చించనున్నారు.

హైదరాబాద్‌లో కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం ఆయన మార్చి 12న ఢిల్లీకి పయనమవుతారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బిజెపి శతవిధాల ప్రయత్నిస్తోంది. బిజెపి ఆశలు ఈ మధ్య పెరిగాయని తెలుస్తోంది. ముఖ్యంగా జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో దాని పనితీరుకు రొమ్ము విరుచుకుంటోంది. గత నెల పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి. నడ్డా ఇంట్లో అమిత్ షా నేతృత్వంలో ఎన్నికలకు పార్టీ సంసిద్ధతను గురించి చర్చించారు. ఆ సమావేశంలో బండి సంజయ్, అరవింద్ ధర్మపురి, డికె. అరుణ, తరుణ్ చుగ్, జి.కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణలో ఎలాగైనా బలం పుంజుకోవాలని బిజెపి శతవిధాల ప్రయత్నిస్తోంది. తెలంగాణ మీద బిజెపి కన్ను పడింది కనుకే అమిత్ షా తరచూ చక్కర్లు కొడుతున్నారు. ఎన్నికల్లో బిజెపి పర్ఫామెన్స్ మెరుగుపరచుకోడానికి పావులు కదుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News