- Advertisement -
న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ నుంచి వలసలను ఆపినట్టే మయన్మార్ నుంచి వచ్చే వారికి అడ్డుకట్ట వేయడానికి భారత్ మయన్మార్ మధ్య కంచె వేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా శనివారం వెల్లడించారు. అసోం రాజధాని గౌహతిలో పోలీస్ కమాండోల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన మాట్లాడారు. దీంతోఇరు దేశాల సరిహద్దుకు దగ్గరగా నివసించే వ్యక్తులు… వీసా లేకుండా 16 కిమీ మరొకరి భూభాగం లోకి ప్రవేశించడానికి అనుమతించే ఫ్రీ మూవ్‌మెంట్ రీజిమ్ (ఎఫ్‌ఎంఆర్) త్వరలో ముగియనుంది. భారత్ లోని మిజోరాం, మణిపూర్, నాగా లాండ్ , అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మయన్మార్‌తో 1643 కిమీ పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ రాష్ట్రాలన్నీ ఎఫ్‌ఎంఆర్ కలిగి ఉన్నాయి. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా 2018లో ఈ ఎఫ్‌ఎంఆర్ విధానాన్ని అమలు చేశారు.
- Advertisement -