Sunday, December 22, 2024

బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్ షా

- Advertisement -
- Advertisement -

Amit Shah arrived at Begumpet Airport

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలోని వివిధ కార్పొరేషన్లకు చెందిన 30 మంది కార్పొరేటర్లు సైతం అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకోనున్నారు. ఉజ్జయిని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని అమిత్ షా, బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దాదాపు అరగంట పాటు అమ్మవారి ఆలయంలో గడపనున్నారని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News