Saturday, February 22, 2025

విజయవాడ చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటనకు విచ్చేశారు. శనివారం రాత్రి 8.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న అమిత్ షాకు ఏపీ మంత్రి నారా లోకేశ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వాగతం పలికారు. అమిత్ షా సీఎం చంద్రబాబు నివాసంలో డిన్నర్ కు హాజరయ్యారు. చంద్రబాబు నివాసంలో ఈ విందుకు ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి, కొందరు సీనియర్ నేతలు కూడా హాజరయ్యారు. అమిత్ షా విందు అనంతరం రాత్రి విజయవాడ నోవాటెల్ హోటల్ లో బస చేశారు. ఆదివారం విజయవాడ సమీపంలోని కొండపావులూరులో ఎన్డీఆర్‌ఎఫ్ నూతన క్యాంపస్ ను అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News