Monday, December 23, 2024

దేశ విముక్తిలో కాంగ్రెస్ కీలకమే కానీ…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ స్వాతంత్య్రోద్యమంలో కాంగ్రెస్ పాత్ర పెద్దదే అని, అయితే ఇతరుల పాత్ర లేదని అనడం సరికాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. కాంగ్రెస్ సారధ్యపు స్వాతంత్రోద్యమం ప్రధానమైనదే అని, అయితే ఇతరులను ఈ విషయంలో చిన్నచూపు చూడటం భావ్యం కాదన్నారు.

స్థానికంగా సంజీవ్ సన్యాల్ రాసిన పుస్తకావిష్కరణ సభలో బుధవారం అమిత్ షా మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రసిద్ధిలో ఇతర విప్లవకారుల పాత్ర కథ పేరిట ఈ పుస్తకం వెలువడింది. స్వాతంత్య్రోద్యమ ఘట్టంలో దాగి ఉన్న బహుముఖ ఘట్టాలను ఈ పుస్తకం విశదీకరిస్తుందని, ఇది ఈ పుస్తక శీర్షికతోనే స్పష్టం అవుతోందని అమిత్ షా తెలిపారు. ప్రతి ఒక్కరి సమిష్టి కృషి త్యాగాల ఫలితమే మనం సాధించుకున్న స్వాతంత్య్రం అని, ఈ ఫలం ఏ ఒక్కరి వల్ల సాధ్యం అయిందని అనుకోవడం పొరపాటే అవుతుందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News