Tuesday, April 8, 2025

అమిత్ షా హైదరాబాద్ షెడ్యూల్ !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన ఆదివారం ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయాన్ని చేరుకోనున్నారు. 3.50కి శంషాబాద్ నోవాటెల్ చేరుకుంటారు. సాయంత్రం 4.00 గంటల నుంచి 4.30 వరకు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినీ నటులు, ఆస్కార్ విజేతలతో తీనీటి విందుల్లో పాల్గొంటారు. సాంయంత్రం 6.00 గంటలకు చేవెళ్ల చేరుకుని ‘పార్లమెంటరీ ప్రవాస్ యోజన’సమావేశంలో పాల్గొంటారు. బహిరం సభలో బిజెపి పార్టీలోకి కీలక నేతల చేరిక ఉంటుంది. ఇప్పటికే నిర్మల్ మాజీ ఎంఎల్‌ఏ మహేశ్వర్ రెడ్డి బిజెపిలో చేరారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు సైతం బిజెపి పార్టీలో చేరే అవకాశం కనపడుతోంది. కసరత్తయితే మొదలయింది.

తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఈ ఏడాదే జరుగనున్న నేపథ్యంలో బిజెపి అగ్ర నేతలు తరచూ తెలంగాణకు రాకపోకలు సాగిస్తున్నారు. జిల్లా కేంద్రాలన్నింటిలోనూ సభల నిర్వహణ చేపట్టేందుకు బిజెపి నాయకులు కసరత్తులు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News