Friday, January 10, 2025

ఆ మూడు కుటుంబ పార్టీలే: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే.. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్రమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఎంఐఎంకు భయపడి ముస్లిం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. పెట్రోల్, డీజిల్ పై అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే.. కెసిఆర్ తగ్గించలేదని ఆరోపించారు. బిజెపి అధికారంలోకి వస్తే.. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవం కూడా నిర్వహించటం లేదని సూచించారు.

కెసిఆర్ సర్కార్ ను గద్దె దించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని అమిత్ షా జోస్యం చెప్పారు. బిజెపి అధికారంలో వరికి క్వింటాల్ కు రూ.3100 చెల్లిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో బిజెపి గెలిస్తే ఆడపిల్లల పేరు మీద రూ. 2 లక్షలు ఫిక్స్డ్ డ్ డిపాజిట్ చేస్తామన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం మూడు కూడా కుటుంబ పార్టీలేనని తెలిపారు. దళితుడిని సిఎం చేస్తామని 2014లో అన్నారు.. ఇప్పటికీ చేయలేదు. కాంగ్రెస్ వాళ్లను గెలిపిస్తే.. వెళ్లి బిఆర్ఎస్ లో కలుస్తారని చెప్పారు. బిఆర్ఎస్ ను గెలిపిస్తే.. ప్రజల సొమ్ము లూటీ చేస్తారని చెప్పుకొచ్చారు.

భూముల వేలంలో రూ. 4వేల కోట్లు అవినీతి జరిగిందని షా ఆరోపించారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్ లీజు వేలంలోనూ, కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా కుంభకోణం జరిగిందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని అమిత్ షా పేర్కొన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.. అదీ జరగలేదన్నారు. ఉద్యోగ పరీక్షల పేపర్లు చేసి కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. రైతులకు రూ. లక్ష రూణమాఫీ చేస్తామని పూర్తి చేయలేదని తెలిపారు. రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మరిచిపోయారు. హైదరాబాద్ లో 4 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం ఏమైందని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News