Wednesday, January 22, 2025

బాలా సాహెబ్, సావర్కార్‌లను అవమానించినవారితో ఉద్ధవ్ జత కట్టారు

- Advertisement -
- Advertisement -

ఎంవిఎకు విశ్వసనీయత లేదు
దేశంలో మత పరమైన రిజర్వేషన్లను మా పార్టీ అనుమతించదు
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

ముంబయి : శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ థాక్కరే కాంగ్రెస్‌తో జత కట్టారని, ఆ పార్టీ నాయకులు శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాక్కరేను. హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కార్‌ను అవమానించారని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం ఆరోపించారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం బిజెపి మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ, తమ పార్టీ దేశంలో మతం ఆధారిత రిజర్వేషన్లను అనుమతించబోదని స్పష్టం చేశారు. ‘(శివసేన (యుబిటి), కాంగ్రెస్, ఎన్‌సిపి (ఎస్‌పి)తో కూడిన) మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)కు విశ్వసనీయత లేదని బిజెపి సీనియర్ నేత అమిత్ షా చెప్పారు. ‘మహా వికాస్ అఘాడిపై నమ్మకం పాతాళంలోకి కూరుకుపోయింది. దానికి విశ్వసనీయత లేదు’ అని ఆయన అన్నారు.

(బిజెపి, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపితో కూడిన) మహాయుతికి ఎంవిఎ నుంచి సవాల్ ఎదురవుతోందని, ఎంవిఎ వాగ్దానాలు సిద్ధాంతాన్ని ఉల్లంఘిస్తున్నాయని, సంతుష్టి రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని అమిత షా పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలోని రాష్ట్రాల్లో ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల నుంచి ఆ పార్టీ వైదొలగిందని ఆయన ఆరోపించారు. ‘వీర్ సావర్కార్ గురించి రెండు మంచి మాటలు మాట్లాడవలసిందిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేయగలరా అని ఉద్ధవ్ థాక్కరేను అడగాలని అనుకుంటున్నా’ అని అమిత్ షా చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు ఎవరైనా బాలాసాహెబ్ థాక్కరేను గౌరవిస్తూ కొన్ని మాటలు మాట్లాడగలరా అని కూడా ఆయన అడిగారు. ‘అటువంటి పరస్పర విరుద్ధ వైఖరుల మధ్య ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కలతో వచ్చిన వారి గురించి మహారాష్ట్ర ప్రజలకు తెలియవస్తే మంచిదే’ అని ఆయన అన్నారు.

బిజెపి ‘సంకల్ప పత్ర’ మేనిఫోస్టో మహారాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని అమిత్ షా చెప్పారు. (జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన) 370 అధికరణం రద్దు తరువాత జెకె ముఖ్యమంత్రి (ఒమర్ అబ్దుల్లా) డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంపై మొట్టమొదటి సారి ప్రమాణం స్వీకరించారని కూడా అమిత్ షా తెలియజేశారు. బిజెపి తీర్మానాలు శిలాక్షరాలు అని అమిత్ షా పేర్కొంటూ, ‘కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా మా ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు మా తీర్మానాలను నెరవేరుస్తాం’ అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష ఎంవిఎ ఎన్నికల వాగ్దానాలు సిద్ధాంతానికి అవమానకరం అని, బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహిస్తాయని అమిత్ షా విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News