- Advertisement -
న్యూఢిల్లీ: అసోం-మిజోరం సరిహద్దుల్లో హింసను అడ్డుకోవడంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విఫలమయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. సోమవారం జరిగిన హింసలో మరణించినవారి కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం ప్రకటిస్తూ ట్విట్ చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హింసకు సంబంధించిన వీడియోను ట్యాగ్ చేశారు. ప్రజల్లో నెలకొన్న విద్వేషం, అవిశ్వసనీయతను తొలగించడంలో కేంద్ర హోంమంత్రి విఫలమయ్యారని రాహుల్ విమర్శించారు. దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు భీతిగొలిపేలా ఉన్నాయన్నారు.
- Advertisement -