Saturday, November 9, 2024

రిజర్వేషన్ల రద్దుపై అమిత్‌షా నకిలీ వీడియో …ఢిల్లీలో కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేరిట వైరలవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీస్‌లు ఆదివారం కేసు నమోదు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పోలీస్‌లు వెల్లడించారు. ఈ కేసు విషయంలోత్వరలో దేశ వ్యాప్తంగా అరెస్టులు ఉండే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. సదరు వీడియోలను షేర్ చేసిన వారిని అదుపు లోకి తీసుకోవచ్చని తెలిపాయి. ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్న ఇలాంటి వీడియోల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఫిర్యాదులో ఎంహెచ్‌ఎ పేర్కొంది. వీడియోలను ఎక్కడి నుంచి షేర్ చేశారో తెలియ జేసే కొన్ని లింకులను కూడా జత చేయడం గమనార్హం. అమిత్‌షా ఈనెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు.

అక్కడ మాట్లాడుతూ బీజేపీ అధికారం లోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తాం” అని వ్యాఖ్యానించారు. దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని షా చెబుతున్నట్టుగా ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. దీన్ని తీవ్రంగా ఖండించిన పార్టీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఇటీవల హెచ్చరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కేంద్రహోంశాఖ తీవ్రంగా పరిగణించింది. ఇది సమాజంలో ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం ఉందంటూ పోలీస్‌కు ఫిర్యాదు చేసింది. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న పలు సోషల్ మీడియా ఖాతాలు షేర్ చేసినట్టు బీజేపీ ఆరోపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News