Wednesday, January 22, 2025

తెలంగాణ బిజెపికి టార్గెట్ ఫిక్స్ చేసిన అమిత్ షా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ బిజెపికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టార్గెట్ ఫిక్స్ చేశారు. కిషన్ రెడ్డితో సహా ముఖ్య నేతలంతా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాల్సిందే అమిత్ షా ఆర్డర్ వేశారు. అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా 75 సీట్లు గెలిచి తీరాల్సిందే అంటూ బిజెపి ఎత్తుగడలు వేస్తోంది. ఎంత పెద్ద లీడర్ అయినా సరే ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందేనని షా చెప్పినట్లు సమాచారం. కిషన్ రెడ్డి ఇంట్లో హైలెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసింది. తెలంగాణ బీజేపీ ఆపరేషన్స్ అన్నీ ఇకపై ఢిల్లీ నుండే సాగనున్నట్లు నేతలు వెల్లడించారు. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ బీజేపీ వార్ రూమ్ ఏర్పాటు చేశారు. పార్టీ లైన్ దాటితే ఇకపై ఢిల్లీ నుండి వార్నింగులు ఇవ్వనున్నారు. ఇతర నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని నేతలకు హెచ్చరించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News