Sunday, December 22, 2024

మణిపూర్‌పై అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో భద్రతా పరిస్థితిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్న త స్థాయి సమావేశం సోమవారం నాడిక్కడ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కుల్దీప్ సింగ్, ప్రధాన కార్యదర్శి వినీత్ జోషి పాల్గొన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ సమావేశానికి హాజరు కాలేదు.

రాష్ట్రంలో తాజాగా మళ్లీ ఘర్షణలు జరిగిన నేపథ్యంలో హోం వ్యవహారాల శాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. మణిపూర్ గవర్నర్ అనుసూయ యుకె హోం మంత్రి అమిత్ షాను కలుసుకున్న మరుసటి రోజే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఏడాది మణిపూర్‌లోని మైతీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News