Monday, December 23, 2024

హైదరాబాద్‌లో అమిత్ షా టూర్ షెడ్యూల్ ఖరారు

- Advertisement -
- Advertisement -

Gujarat won't vote for dream sellers: Amit Shah

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో కేంద్రం మంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. 16వ తేదీ రాత్రి 9.50 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. పోలీస్ అకాడమీలో బస చేస్తారు. 17వ తేదీ ఉదయం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. 8.45 నుంచి 11.45 వరకు పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేస్తారు. తర్వాత పరేడ్ గ్రౌండ్ నుంచి బేగంపేట టూరిజం ప్లాజాకు చేరుకుని పార్టీ ముఖ్యనేతల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌కు చేరుకుంటారు. ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వికలాంగులకు ఉపకరణాల పంపిణీ చేస్తారు. మళ్ళీ సాయంత్రం పోలీస్ అకాడమీకి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 7.30కు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

Amit Shah Hyderabad Tour Schedule

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News