Sunday, December 22, 2024

16న నగరానికి అమిత్ షా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈ నెల 17న నగరంలో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖారారు అయింది. ఈ నెల 17న జరిగే తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం ఒక్కరోజు ముందే అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. 16వ తేదీన రాత్రి 7.55 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి అమిత్ షా చేరుకోనున్నారు.

అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సిఆర్‌పిఎఫ్ సెక్టార్స్ ఆఫీసర్స్ చేరుకొని. రాత్రి అక్కడే బస చేయనున్నారు. 17న ఉదయం పరేడ్ గ్రౌండ్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం నిర్వహించనున్న సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఈ పర్యటన సందర్భంగా తెలంగాణ బిజెపి నేతలతో అమిత్ షా సమావేశమయ్యే అవకాశముంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News